16 ఏప్రి, 2013

164. వైద్యః, वैद्यः, Vaidyaḥ

ఓం వైద్యాయ నమః | ॐ वैद्याय नमः | OM Vaidyāya namaḥ


విద్యాః అస్మిన్ సంతి సకల విద్యలును ఈతనియందు గలవు. లేదా విద్యానాం సమూహః వైద్యః సకల విద్యల రాశి; సర్వవిద్యానాం వేదితా అన్ని విద్యలును ఎరిగిన మహాతత్త్వము విష్ణువే.

:: పోతన భాగవతము - షష్టమ స్కంధము ::
వినుము, బ్రహ్మయు, భర్గుండును, బ్రజాపతులును, మనువులును, నింద్రులును, వీరలు నిఖీల భూతంబులకు భూతి హేతువులైన మద్భూతి విభవంబులు. మఱియు నాకు యమ నియమాది సహిత సంధ్యావందనాది రూపంబగు తపంబు హృదయంబు. సాంగ జపవ ద్ధ్యానరూపం బగు విద్య శరీరంబు...

ప్రజాపతీ! విను. బ్రహ్మదేవుడు, శివుడు, ప్రజాపతులు, మనువులు, ఇంద్రులు మొదలైన సమస్త భూతజాలాలూ నా మహాశక్తి వలన జన్మించినవారే! ఇంద్రియ నిగ్రహం, నియమం సంధ్యావందనం మొదలైన వానితో కూడిన తపస్సే నా హృదయం. అంగోపాంగ సహితమై ధ్యానరూపమైన విద్యయే నా దేహం.



Vidyāḥ asmin santi / विद्याः अस्मिन् सन्ति All Vidyās or branches of knowledge are in Him. Vidyānāṃ samūhaḥ vaidyaḥ / विद्यानां समूहः वैद्यः He is an embodiment of all branches of knowledge. Sarvavidyānāṃ veditā / सर्वविद्यानां वेदिता He is the knower of all Vidyās or branches of knowlege.

Śrīmad Bhāgava - Canto 8, Chapter 16
Namo dviśīrṣe tripade catuḥśrr̥ṅgāya tantave,
Saptahastāya yajñāya trayīvidyātmane namaḥ. (31)
Namaḥ śivāya rudrāya namaḥ śaktidharāya ca,
Sarvavidyādhipataye bhūtānāṃ pataye namaḥ. (32)

:: श्रीमद्भागवते अष्टमस्कन्धे षोडशोऽध्यायः ::
नमो द्विशीर्षे त्रिपदे चतुःश्रृङ्गाय तन्तवे ।
सप्तहस्ताय यज्ञाय त्रयीविद्यात्मने नमः ॥ ३१ ॥ 
नमः शिवाय रुद्राय नमः शक्तिधराय च ।
सर्वविद्याधिपतये भूतानां पतये नमः ॥ ३२ ॥

I offer my respectful obeisances unto You, who have two heads (prāyaṇīya and udāyanīya), three legs (savana-traya), four horns (the four Vedas) and seven hands (the seven chandas, such as Gāyatrī). I offer my obeisances unto You, whose heart and soul are the three Vedic rituals (karma-kāṇḍa, jñāna-kāṇḍa and upāsanā-kāṇḍa) and who expand these rituals in the form of sacrifice. I offer my respectful obeisances unto You, Lord Śiva, or Rudra, who are the reservoir of all potencies, the reservoir of all knowledge, and the master of everyone.

वेद्यो वैध्यस्सदा योगी वीरहा माधवो मधुः ।
अतीन्द्रियो महामायो महोत्साहोमहाबलः ॥ १८ ॥

వేద్యో వైధ్యస్సదా యోగీ వీరహా మాధవో మధుః ।
అతీన్ద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః ॥ ౧౮ ॥

Vedyo vaidhyassadā yogī vīrahā mādhavo madhuḥ ।
Atīndriyo mahāmāyo mahotsāhomahābalaḥ ॥ 18 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి