6 మార్చి, 2013

123. సర్వగః, सर्वगः, Sarvagaḥ

ఓం సర్వగాయ నమః | ॐ सर्वगाय नमः | OM Sarvagāya namaḥ


కారణత్వేన సర్వత్ర వ్యాప్తత్వాత్ సర్వత్ర గచ్ఛతి ఇతి సర్వదృశ్యజగత్తునకును కారణరూపుడుగా సర్వత్ర వ్యాపించియుండు వాడు గావున విష్ణువు అంతటను పోవు వాడు లేదా చేరియుండువాడు. అన్ని చోట్ల అన్ని కాలములలో ఉపాదాన కారణ రూపుడగుటచే కార్యములందుండు వాడగుటచే సర్వగః అని విష్ణువే చెప్పబడును.

:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::
యిట్టి దేహంబునందున్న యాత్మ యేకంబును, శుద్ధ స్వరూపంబును, స్వయంజ్యోతియు, నిర్గుణంబును, గుణాశ్రయంబును, వ్యాప్య వ్యాపకంబును, నసంవృతంబును, సాక్షిభూతంబును, నిరాత్మంబును నగు, దీని దేహంబుకంటె వేరుగా నెవ్వండు దెలియు వాఁడు మత్పరుం డగుటం జేసి దేహధారియై యుండియుఁ దద్గుణంబులం బొరయక వర్తించు.

దేహమునందలి ఆత్మ శుద్ధ స్వరూపము గలది. అది యేకంబును, శుద్ధ స్వరూపంబును, స్వయంజ్యోతియు, నిర్గుణంబును, గుణాశ్రయంబును, సర్వ వ్యాపకంబును, జడములచే కప్పబడినిదీ, సాక్షిభూతంబును, నిరాత్మంబైనది. కాబట్టి ఆత్మను దేహంకంటే వేరని భావించేవాడు నా యందు భక్తి పెంచుకుంటాడు. అందువల్ల దేహధారి అయినప్పటికీ దేహ గుణాలను పొందడు.

:: శ్రీమద్దేవీభాగవతే ప్రథమస్కన్ధే అష్టమోఽధ్యాయః ::
దేవేషు విష్ణుః కథితః సర్వగః సర్వపాలకః ।
యతో విరాడిదం సర్వముత్పన్నం సచరాచరమ్ ॥ 14 ॥


దేవతలలో విష్ణు భగవానుడే సర్వవ్యాపియై అన్ని భూతములను రక్షించువాడు. ఆయనద్వారానే సమస్త చరాచర విరాట్ సంసార సృష్టి జరిగినది.



Kāraṇatvena sarvatra vyāptatvāt sarvatra gacchati iti / कारणत्वेन सर्वत्र व्याप्तत्वात् सर्वत्र गच्छति इति He who goes or is everywhere and is all-pervading as the cause of everything.

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 20
Ekaḥ śuddhaḥ svayaṃjyotirnirguṇo’sau guṇāśrayaḥ,
Sarvago’nāvr̥taḥ sākṣī nirātmātmātmanaḥ paraḥ. (7)

:: श्रीमद्भागवते चतुर्तस्कन्धे विंशोऽध्यायः ::
एकः शुद्धः स्वयंज्योतिर्निर्गुणोऽसौ गुणाश्रयः ।
सर्वगोऽनावृतः साक्षी निरात्मात्मात्मनः परः ॥ ७ ॥

The individual soul is one, Pure, non-material and self-effulgent. He is the reservoir of all good qualities, and He is all-pervading. He is without material covering, and He is the witness of all activities. He is completely distinguished from other living entities, and He is transcendental to all embodied souls.

:: श्रीमद्देवीभागवते प्रथमस्कन्धे अष्टमोऽध्यायः ::
देवेषु विष्णुः कथितः सर्वगः सर्वपालकः ।
यतो विराडिदं सर्वमुत्पन्नं सचराचरम् ॥ १४ ॥


Śrīmad Devī Bhāgavata - Book 1, Chapter 8
Deveṣu Viṣṇuḥ kathitaḥ sarvagaḥ sarvapālakaḥ,
Yato virāḍidaṃ sarvamutpannaṃ sacarācaram. 14.

Amongst the divinities, Lord Viṣṇu alone is known to be the protector of all being all pervasive. The total massive animate and inanimate creation is His.

सर्वगस्सर्वविद्भानु र्विष्वक्सेनो जनार्धनः ।
वेदो वेदविदव्यंगो वेदांगो वेदवित्कविः ॥ १४ ॥

సర్వగస్సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్ధనః ।
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ ౧౪ ॥

Sarvagassarvavidbhānu rviṣvakseno janārdhanaḥ ।
Vedo vedavidavyaṃgo vedāṃgo vedavitkaviḥ ॥ 14 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి