22 మార్చి, 2013

139. చతుర్దంష్ట్రః, चतुर्दंष्ट्रः, Caturdaṃṣṭraḥ

ఓం చతుర్దంష్ట్రాయ నమః | ॐ चतुर्दंष्ट्राय नमः | OM Caturdaṃṣṭrāya namaḥ


చతుర్దంష్ట్రః, चतुर्दंष्ट्रः, Caturdaṃṣṭraḥ
దంష్ట్రాశ్చతస్రో యస్య స చతుర్దంష్ట్రో నృకేసరీ ।
దంష్ట్రాశబ్దేన శృంగాణి సాదృశ్యాత్కథితాని వా ॥


నాలుగు కోరలు గల నృసింహావతారి; లేదా శృంగము (కొమ్ము) కోరవలెనే యుండును కావున దంష్ట్రా శబ్దమునకు కొమ్ము అనియూ అర్థము చెప్పికొనవచ్చును. కాబట్టి నాలుగు కొమ్ములు గల వరాహావతారి అయిన విష్ణువు కూడా చతుర్దంష్ట్రః అని పిలువబడును.

'చత్వారి శృంగా' (ఋగ్వేదము 4.58.3) 'నాలుగు కొమ్ములుకలవాడు' ఇత్యాదిగా ఋగ్వేదమున చెప్పబడిన అగ్నిమూర్తి, నృసింహావతారి, వరాహావతారి - శ్రీమహావిష్ణువు విభూతులే అని చెప్పవలయును.

:: భగవద్గీత - విశ్వరూపసందర్శనయోగము ::
దంష్ట్రాకరాలాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని ।
దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస ॥ 25 ॥


కోరలచే భయంకరములైనవియు, ప్రళయాగ్నినిబోలినవియునగు మీ ముఖములను జూచి నేను దిగ్భ్రమజెందియున్నాను. సుఖమునుగూడ పొందకయేయున్నాను. కావున ఓ దేవదేవా! జగదాశ్రయా! ప్రసన్నులుకండు.



Daṃṣṭrāścatasro yasya sa caturdaṃṣṭro nr̥kesarī,
Daṃṣṭrāśabdena śr̥ṃgāṇi sādr̥śyātkathitāni vā.


दंष्ट्राश्चतस्रो यस्य स चतुर्दंष्ट्रो नृकेसरी ।
दंष्ट्राशब्देन शृंगाणि सादृश्यात्कथितानि वा ॥


He who has four protruding teeth in the incarnation of Nr̥siṃha. Or since Śr̥ṃgas i.e., horns too resemble teeth, Caturdaṃṣṭraḥ can also be considered as the Varāha incarnation of Lord Viṣṇu. Vide the Śr̥ti, Catvāri śr̥ṃgā / चत्वारि शृंगा (R̥gveda 4.58.3) 'the One with four horns' the blazing form, Nr̥siṃha and Varāha - all these are different forms of Viṣṇu.

Bhagavad Gītā - Chapter 11
Daṃṣṭrākarālāni ca te mukhāni dr̥ṣṭvaiva kālānala sannibhāni,
Diśo na jāne na labhe ca śarma prasīda deveśa jagannivāsa.
(25)

:: श्रीमद्भगवद्गीता - विश्वरूपसंदर्शनयोग ::
दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कालानल सन्निभानि ।
दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास ॥ २५ ॥


Having merely seen Your mouths made terrible with their teeth and resembling the fire of dissolution, I have lost the sense of direction and find no comfort. Be gracious, O Lord of gods, O abode of the universe.

लोकाध्यक्षस्सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः ।
चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः ॥ १५ ॥

లోకాధ్యక్షస్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః ।
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ॥ ౧౫ ॥

Lokādhyakṣassurādhyakṣo dharmādhyakṣaḥ kr̥tākr̥taḥ ।
Caturātmā caturvyūhaścaturdaṃṣṭraścaturbhujaḥ ॥ 15 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి