ఓం సహిష్ణవే నమః | ॐ सहिष्णवे नमः | OM Sahiṣṇave namaḥ
సహతే సహించును. సహించశక్తి కలవాడై యుండును. శ్రీ విష్ణువు హిరణ్యాక్షాదులను సహించు తన శక్తిచే అణగ ద్రొక్కును; తిరస్కరించును.
:: పోతన భాగవతము - ఆష్టమ స్కంధము, గజేంద్ర మోక్షము ::
వినువీధిం జనుదేరఁ గాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీ
వనసంపత్తి నిరాకరిష్ణుఁ గరుణావర్ధిష్ణు యోగీంద్ర హృ
ద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజనబృంద ప్రాభావాలంకరి
ష్ణు నవోఢోల్లసదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్.
రాక్షసుల బ్రతుకు తెరువులను తొలగద్రోసేవాడూ, నిండు దయతో యోగీంద్రుల మనస్సులలో నివాసం చేసేవాడూ, ఓర్పుతో భక్తుల గొప్పతనాన్ని పెంపొందించేవాడూ, తొలి ప్రాయంతో చెలువొందే లక్ష్మీదేవిని సేవించేవాడూ, జయశీలుడూ, కాంతిమంతుడూ అయిన విష్ణుదేవుడు ఆకాశమార్గంలో వస్తుండగా దేవతలు చూచినారు.
Sahate forebears. He is the one with patience and forbearance. Lord Viṣṇu terminated demons like Hiraṇyākṣa with his endurance and patience.
भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः । |
अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः ॥ १६ ॥ |
భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః । |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ ౧౬ ॥ |
Bhrājiṣṇurbhojanaṃ bhoktā sahiṣṇurjagadādijaḥ । |
Anagho vijayo jetā viśvayoniḥ punarvasuḥ ॥ 16 ॥ |
ahaa entha ghanamina prabhu varnana.
రిప్లయితొలగించండి