28 మార్చి, 2013

145. జగదాదిజః, जगदादिजः, Jagadādijaḥ

ఓం జగదాదిజాయ నమః | ॐ जगदादिजाय नमः | OM Jagadādijāya namaḥ


జగదాదిజః, जगदादिजः, Jagadādijaḥ
జగత్తులకు ఆదియందు జనించువాడు శ్రీ మహా విష్ణువు; హిరణ్యగర్భుడు మొదలగు తత్త్వముల రూపమున ఉండువాడు.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
సీ.గురుశక్తితో విరాట్పురుషుండు సంభవం బయ్యే, నయ్యండంబు నర్థిఁబొదివి
యంబు ముఖావరణంబు లొక్కొకటికి దశగుణీతంబులై తవిలి యావ
రణములై యుండును, గ్రమమున లోకంబులకు "మేలుకట్లు" పోలికఁ దనర్చి
పంకజోదరుని రూపము విలసించును, లోలత జలములోఁ దేలుచున్న
తే.హేమ మయమైన యండంబులో మహాను, భావుఁ డభవుండు హరి దేవదేవుఁ డఖిల
జేత నారాయణుఁడు ప్రవేశించి యపుడు, విష్ణుపద భేదనంబు గావించి యందు.

ఆ అండంలో మహత్తరమైన శక్తితో విరాట్‍పురుషుడు విరాజిల్లు తుంటాడు. ఆ అండాన్ని పొదువుకొని పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తు అనే ఆవరణాలు ఒకదానికంటే ఒకటి పదింతలు ప్రమాణం కలిగి ఉంటాయి. లోకాలకు మేల్కట్టు చాందినీవలె ఒప్పియున్న ఆ పొరలలోనుంచి విష్ణుదేవుని తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. జలంలో తేలుతూ ఉన్న బంగారుమయమైన ఆ అండంలో మహానుభావుడు, అభవుడు, శ్రీహరి, దేవదేవుడు, విశ్వవిజేత అయిన నారాయణుడు ప్రవేశించి గగనమండలాన్ని భేదించి వేస్తాడు.



He Himself originates the universe in the beginning in the form of Hiraṇyagarbha.

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 26
Etānyasaṃhatya yadā mahadādīni sapta vai,
Kālakarmaguṇopeto jagadādirūpāviśat.
(50)

:: श्रीमद्भागवते - तृतीयस्कन्धे, षड्विंशोऽध्यायः ::
एतान्यसंहत्य यदा महदादीनि सप्त वै ।
कालकर्मगुणोपेतो जगदादिरूपाविशत् ॥ ५० ॥

When all these elements were unmixed, He, the origin of creation, along with time, work, and the qualities of the modes of material nature, entered into the universe with the total material energy in seven divisions (the five material elements, the total energy (mahat-tattva) and the ego).

भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः
अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः ॥ १६ ॥

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ ౧౬ ॥

Bhrājiṣṇurbhojanaṃ bhoktā sahiṣṇurjagadādijaḥ
Anagho vijayo jetā viśvayoniḥ punarvasuḥ ॥ 16 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి