9 మార్చి, 2013

126. జనార్దనః, जनार्दनः, Janārdanaḥ

ఓం జనార్దనాయ నమః | ॐ जनार्दनाय नमः | OM Janārdanāya namaḥ


జనాన్ దుష్టానర్దయతి హినస్తి నరకాదికాన్ సంప్రాపయత్యభ్యుదయం నిశ్శ్రేయసమథాపి వా పుమర్థం యాచత ఇతి జనార్ధన ఇతీరితః దుర్జనులను హింసించును; దుర్జనులను నరకాది లోకములకు పోవునట్లు చేయును. పురుషార్థముల కొఱకు అర్థింపబడువాడు కావున ఆతడు జనార్దనుడు.

:: మహాభారతము - ఉద్యోగ పర్వము, సనత్సుజాత పర్వము ::
పుణ్డరీకం పరంధామ నిత్యమ్ అక్షయమ్ అక్షరమ్ ।
తద్భావాత్ పుణ్డరీకాక్షో దస్యు త్రాసాజ్ జనార్దనః ॥ 6 ॥

సర్వోత్కృష్టమూ, శాశ్వతమూ నిత్యమూ అయిన ధామమును పుణ్డరీకమందురు. అట్టి అనశ్వరమైన పుణ్డరీకము గలవాడు గనుక, ఆయన పుణ్డరీకాక్షుడని పిలువ బడుతాడు. అట్టి పుణ్డరీకాక్షుడు దుర్జనుల హృదయముల యందు భయమును కలుగజేయును గనుక, ఆతను జనార్దనుడని పిలువ బడును.

:: పోతన భాగవతము - దశమ స్కందము, పూర్వ భాగము ::
శా.ఏ పుణ్యాతిశయప్రభావముననో యీ జన్మమం దిక్కడన్

నీ పాదంబులఁ గంటి ని న్నేఱిఁగితిన్ నీవుం గృపాళుండవై

నాపై నర్మిలిఁ జేసి మాన్పఁ గదవే నానాధనాగార కాం

తా పుత్రాదులతోడి బంధనము భక్తవ్రాత చింతామణీ.

భక్తులపాలిటి చింతామణివైన శ్రీకృష్ణా! ఏ మహాపుణ్య మహిమవల్లనో ఈ జన్మలో ఇక్కడ నీ చరణపద్మాలు దర్శించగల్గినాను. నిన్ను తెలుసుకొన గల్గినాను. నీవును దయాస్వభావుడవై నాయెడనున్న ప్రేముడిచే నాకు గృహ విత్త దార సుతాదుల మీది మోహపాశమును తొలగించుము.



Janān duṣṭānardayati hinasti narakādikān saṃprāpayatyabhyudayaṃ niśśreyasamathāpi vā pumarthaṃ yācata iti janārdhana itīritaḥ / जनान् दुष्टानर्दयति हिनस्ति नरकादिकान् संप्रापयत्यभ्युदयं निश्श्रेयसमथापि वा पुमर्थं याचत इति जनार्धन इतीरितः He who oppresses the evil doers; sends them to hell. He who is sought for salvation or worldly happiness.

Mahābhārata - Book V, Section LXX
Puṇḍarīkaṃ paraṃ dhāma nityam akṣayam akṣaram,
Tadbhāvāt puṇḍarīkākṣo dasyu trāsāj janārdanaḥ.
(6)

:: महाभारत - उद्योग पर्व, सनत्सुजात पर्व ::
पुण्डरीकं परं धाम नित्यम् अक्षयम् अक्षरम् ।
तद्भावात् पुण्डरीकाक्षो दस्यु त्रासाज् जनार्दनः ॥ ६ ॥


He is called Puṇḍarīkākṣa from Puṇḍarīka implying his high and eternal abode, and Akṣa implying 'indestructible'; and he is called Janārdana because he strikes fear into the hearts of all wicked beings.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 48
Diṣṭayā janārdana bhavāniha naḥ pratīto
   Yogeśvarairapi durāpagatiḥ sureśaiḥ,
Chindhyāśu naḥ sutakalatradhanāptageha
   Dehādimoharaśanāṃ bhavadīyamāyām.
(27)

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे अष्टचत्वारिंशोऽध्यायः ::
दिष्टया जनार्दन भवानिह नः प्रतीतो
   योगेश्वरैरपि दुरापगतिः सुरेशैः ।
छिन्ध्याशु नः सुतकलत्रधनाप्तगेह
   देहादिमोहरशनां भवदीयमायाम् ॥ २७ ॥

It is by our great fortune, Janārdana, that You are now visible to us, for even the masters of yoga and the foremost gods can achieve this goal only with great difficulty. Please quickly cut the ropes of our illusory attachment for children, wife, wealth, influential friends, home and body. All such attachment is simply the effect of Your illusory material energy.

सर्वगस्सर्वविद्भानु र्विष्वक्सेनो जनार्धनः
वेदो वेदविदव्यंगो वेदांगो वेदवित्कविः ॥ १४ ॥

సర్వగస్సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్ధనః
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ ౧౪ ॥

Sarvagassarvavidbhānu rviṣvakseno janārdhanaḥ
Vedo vedavidavyaṃgo vedāṃgo vedavitkaviḥ ॥ 14 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి