19 మార్చి, 2013

136. కృతాఽకృతః, कृताऽकृतः, Kr̥tā’kr̥taḥ

ఓం కృతాఽకృతాయ నమః | ॐ कृताऽकृताय नमः | OM Kr̥tā’kr̥tāya namaḥ


కార్య కారణ రూపోఽసౌ కృతాకృత ఇతీర్యతే కృతము అనగా చేయబడినది అయిన కార్యము, అకృతము అనగా చేయబడనిదియగు కారణము. కార్యకారణ స్వరూపుడగుటచే విష్ణువు కృతాకృతః. కృతశ్చ అకృతశ్చ చేయబడిన వాడును, చేయబడని వాడునూ. మాయాశక్తి ద్వారమున జగద్రూపమున తాను నిర్మించబడినందున కార్య రూపుడు అగును కావున 'కృతః'. చేయబడనివాడు అనగా జగములకు కారణ రూపుడు కావున 'అకృతః'  చేయబడనివాడు.

:: పోతన భాగవతము - ఆష్టమ స్కంధము, గజేంద్ర మోక్షము ::
సీ.శాంతున కపవర్గసౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషు
నకు, ఘోరునకు గూఢునకు గుణధర్మికి సౌమ్యున కధిక విజ్ఞాన మయున
కఖిలేంద్రియ ద్రష్ట కధ్యక్షునకు బహు క్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి
మూలప్రకృతి కాత్మ మూలున కఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంత కృతికి
అ.నెఱి నసత్య మనెడి నీడతో వెలుఁగుచు, నుండు నెక్కటికి మహోత్తరునకు
నిఖీల కారణునకు, నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొఱకు.

భగవంతుడు శాంతస్వరూపుడు. మోక్షానికి అధిపతి. ఆనందానికి ఆలవాలం. స్వపరభేదం లేనివాడు. దుష్టులకు భయంకరుడు. సంసారబద్ధులకు అందనివాడు. గుణాల ధర్మము కలవాడు. సరళ స్వభావమూ విశేషమైన జ్ఞానము  కలిగినవాడు. అన్ని ఇంద్రియాల కార్యాలు చూచేవాడు. అన్నిటికీ ప్రభువు. సర్వజ్ఞుడు. దయారసానికి సముద్రం వంటివాడు. అన్నింటికీ మూలపురుషుడు. ఆత్మకు ఆధారమైనవాడు. ఇంద్రియాలను ఆజ్ఞాపించేవాడు. దుఃఖాన్ని తొలగించేవాడు. మాయ అనే నీడలో నిండుగా వెలిగేవాడూ, ఒంటరివాడు. మిక్కిలి గొప్పవాడు. అన్నిటికీ బీజమైన (కారణమైన) వాడు. ఏ కారణమూ లేనివాడు. అటువంటి స్వామికి నన్ను కాపాడుమంటూ నమస్కరిస్తున్నాను.



Kārya kāraṇa rūpo’sau kr̥tākr̥ta itīryate Kārya is the effect which is the result of an action. Kāraṇa is the invisible cause that led to an action. As He is both the cause and effect, Lord Viṣṇu is Kr̥tākr̥taḥ. Kr̥taśca akr̥taśca the One who is the action and also the One who is not the action. He is the creation Himself hence He is Kr̥tāḥ and since He is also the cause of the creation, He is Akr̥taḥ.

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 3
Yasminnidaṃ yataśrcedaṃ yenedaṃ ya idaṃ svayam,
Yo’smātparasmācca parastaṃ prapadhye svayambhuvam. (3)

:: श्रीमद्भागवते अष्टम स्कन्धे तृतियोऽध्यायः ::
यस्मिन्निदं यतश्र्चेदं येनेदं य इदं स्वयम् ।
योऽस्मात्परस्माच्च परस्तं प्रपध्ये स्वयम्भुवम् ॥ ३ ॥

He is the supreme platform on which everything rests, the ingredient by which everything has been produced, and the person who has created and is the only cause of this cosmic manifestation. Nonetheless, He is different from the cause and the result. I surrender unto Him, the Supreme God, who is self-sufficient in everything.


लोकाध्यक्षस्सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः
चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः ॥ १५ ॥

లోకాధ్యక్షస్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ॥ ౧౫ ॥

Lokādhyakṣassurādhyakṣo dharmādhyakṣaḥ kr̥tākr̥taḥ
Caturātmā caturvyūhaścaturdaṃṣṭraścaturbhujaḥ ॥ 15 ॥

1 కామెంట్‌: