13 మార్చి, 2013

130. వేదాఙ్గః, वेदाङ्गः, Vedāṅgaḥ

ఓం వేదాఙ్గాయ నమః | ॐ वेदाङ्गाय नमः | OM Vedāṅgāya namaḥ


Vedāṅgaḥ
యస్య వేదా అంగభూతాః స వేదాంగ ఇతీర్యతే వేదములు ఎవని అంగములుగా ఉన్నవో, అట్టివాడు.

:: పోతన భాగవతము - తృతీయ స్కందము ::
చతురామ్నాయ వపుర్విశేషధర! చంచత్సూకరాకర! నీ
సితదంష్ట్రాగ్ర విలగ్నమైన ధర రాజిల్లెం గులాద్రీంద్ర రా
జిత శృంగోపరి లగ్నమేఘము గతిం జెల్వారి, విద్వజ్జనాం
చిత హృత్పల్వలలోల! భూరమణ! లక్ష్మీనాథ! దేవోత్తమా!


చతుర్వేద స్వరూపమైన శరీరాన్ని ధరించి ఉన్న ఓ యజ్ఞవరాహస్వామీ! నీవు జ్ఞానవంతుల అంతరంగాలనే నీటి మడుగులో క్రీడిస్తుంటావు. భూదేవికీ, శ్రీదేవికీ మనోహరుడవు. దేవతలందరికీ అగ్రేసరుడవు. స్వామీ! నీ తెల్లని దంష్ట్రాంచలాన తగులుకొన్న భూమి కోండల చక్రవర్తి వెండి శిఖరాగ్రాన విరాజిల్లుతుండే నీలమేఘంలా అందాలూ చిందుతూ ఉంది.



Yasya vedā aṃgabhūtāḥ sa vedāṃga itīryate / यस्य वेदा अंगभूताः स वेदांग इतीर्यते He of whom Vedas are parts or organs is Vedāṅgaḥ.

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 13
Jitaṃ jitaṃ te’jita yajñabhāvana trayīṃ tanuṃ svāṃ paridhunvate namaḥ,
Yadromagarteṣu nililyuraddhayastasmai namaḥ kāraṇasūkarāya te.
(35)

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे त्रयोदशोऽध्यायः ::
जितं जितं तेऽजित यज्ञभावन त्रयीं तनुं स्वां परिधुन्वते नमः ।
यद्रोमगर्तेषु निलिल्युरद्धयस्तस्मै नमः कारणसूकराय ते ॥ ३५ ॥


O unconquerable enjoyer of all sacrifices, all glories and all victories unto You! You are moving in Your form of the personified Vedas, and in the skin pores of Your body the oceans are submerged. For certain reasons (to uplift the earth) You have now assumed the form of a boar.
सर्वगस्सर्वविद्भानु र्विष्वक्सेनो जनार्धनः ।
वेदो वेदविदव्यंगो वेदांगो वेदवित्कविः ॥ १४ ॥

సర్వగస్సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్ధనః ।
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ ౧౪ ॥

Sarvagassarvavidbhānu rviṣvakseno janārdhanaḥ ।
Vedo vedavidavyaṃgo vedāṃgo vedavitkaviḥ ॥ 14 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి