11 మార్చి, 2013

128. వేదవిత్, वेदवित्‌, Vedavit

ఓం వేదవిదే నమః | ॐ वेदविदे नमः | OM Vedavide namaḥ


వేదం వేదార్థంచ యథావద్ వేత్తి వేదమును, వేదము వలన తెలియదగు వాస్తవతత్త్వమైన వేదార్థమును కూడా వాస్తవ రూపమున ఎరుగువాడు.

:: భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము ::
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్స్మృతిర్జ్ఞాన మపోహనం చ ।
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ ॥ 15 ॥

నేను సమస్త ప్రాణులయొక్క హృదయమందుండువాడను; నావలననే జీవునకు జ్ఞాపకశక్తి, జ్ఞానము, మఱపు కలుగుచున్నవి. వేదములన్నిటిచేతను తెలియదగినవాడను నేనే అయియున్నాను. మఱియు వేదము నెఱిగినవాడనుగూడ నేనే అయియున్నాను.

:: మహాభారతము ::
సర్వే వేదాః సర్వవేద్యాః సశాస్త్రా ।
   సర్వే యజ్ఞాః సర్వ ఇజ్యాశ్చ కృష్ణః ।
విదుః కృష్ణం బ్రాహమణా స్తత్త్వతో యే ।
   తేషాం రాజన్ సర్వయజ్ఞాః సమాప్తాః ॥

రాజా! సర్వవేదములును సర్వవేద్యములును, సర్వయజ్ఞములును, యజ్ఞములద్వారా ఆరాధించబడు సర్వదేవతలును కృష్ణుడే! ఏ బ్రహ్మతత్త్వవేత్తలు కృష్ణుని వాస్తవరూపమున ఎరుగుదురో వారికి సర్వ యజ్ఞ ఫలములును లెస్సగా పొందబడినవియే యగును.



Vedaṃ vedārthaṃca yathāvad vetti / वेदं वेदार्थंच यथावद् वेत्ति He who knows the Vedās and the true essence of Vedās as well is Vedavit.

Bhagavad Gītā - Chapter 15
Sarvasya cāhaṃ hr̥di sanniviṣṭo mattaḥ ssmr̥tirjñāna mapohanaṃ ca,
Vedaiśca sarvairahameva vedyo vedāntakr̥dvedavideva cāham. (15)

:: श्रीमद्भगवद्गीता - पुरुषोत्तमप्राप्ति योग ::
सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्स्मृतिर्ज्ञान मपोहनं च ।
वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम् ॥ १५ ॥

I am seated in the hearts of all. From Me are memory, knowledge and their loss. I alone am the object to be known through all the Vedās; I am also the originator of the Vedānta and I myself am the knower of the Vedās.

Mahābhārata
Sarve vedāḥ sarvavedyāḥ saśāstrā,
   Sarve yajñāḥ sarva ijyāśca kr̥ṣṇaḥ,
Viduḥ kr̥ṣṇaṃ brāhamaṇā stattvato ye,
   Teṣāṃ rājan sarvayajñāḥ samāptāḥ.

:: महाभारत ::
सर्वे वेदाः सर्ववेद्याः सशास्त्रा ।
   सर्वे यज्ञाः सर्व इज्याश्च कृष्णः ।
विदुः कृष्णं ब्राहमणा स्तत्त्वतो ये ।
   तेषां राजन् सर्वयज्ञाः समाप्ताः ॥

All the Vedās, Śastrās, Yajñās and homās are Kr̥ṣṇa. Those Brāhmaṇās that know Kr̥ṣṇa in reality have performed all the yajñās.

सर्वगस्सर्वविद्भानु र्विष्वक्सेनो जनार्धनः ।
वेदो वेदविदव्यंगो वेदांगो वेदवित्कविः ॥ १४ ॥

సర్వగస్సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్ధనః ।
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ ౧౪ ॥

Sarvagassarvavidbhānu rviṣvakseno janārdhanaḥ ।
Vedo vedavidavyaṃgo vedāṃgo vedavitkaviḥ ॥ 14 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి