30 సెప్టెం, 2013

331. వాయువాహనః, वायुवाहनः, Vāyuvāhanaḥ

ఓం వాయువాహనాయ నమః | ॐ वायुवाहनाय नमः | OM Vāyuvāhanāya namaḥ


ఆవహాదీన్ సప్తవాయూన్ యో వాహయతి కేశవః ।
స వాయువాహన ఇతి ప్రోచ్యతే విబుధోత్తమైః ॥

ఆవహము మొదలగు సప్తవాయువులను తమ తమ స్కంధములయందు చలించునట్లు చేయునుగనుక ఆ కేశవునకు వాయువాహనః అను నామముగలదు.

సప్తవాయువులు: 1. పృథివికినీ మేఘమండలమునకును నడుమ 'ఆవహము'. 2. మేఘమండలమూ, రవిమండలముల నడుమ 'ప్రవహము'. 3. రవిమండలమూ చంద్రమందలముల నడుమ 'అనువహము'. చంద్రమండల నక్షత్రమండలముల నడుమ 'సంవహము'. 5. నక్షత్రములకూ, గ్రహములకూ నడుమ 'వివహము'. 6. గ్రములకూ సప్తర్షిమండలముల నడుమ 'పరావహము'. 7. సప్తర్షి మండలమూ, ధ్రువమండలముల నడుమ 'పరివహము'లు వీచుచుండును.



Āvahādīn saptavāyūn yo vāhayati keśavaḥ,
Sa vāyuvāhana iti procyate vibudhottamaiḥ.

आवहादीन् सप्तवायून् यो वाहयति केशवः ।
स वायुवाहन इति प्रोच्यते विबुधोत्तमैः ॥

Since Lord Keśava vibrates the seven āvahas or winds/atmospheres (1. Āvaha, 2. Pravaha, 3. Anuvaha, 4. Saṃvaha, 5. Vivaha, 6. Parāvaha and 7. Parivaha), He is called Vāyuvāhanaḥ.

स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः
वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः ॥ ३६ ॥

స్కన్దః స్కన్దధరో ధుర్యో వరదో వాయువాహనః
వాసుదేవో బృహద్భానురాదిదేవః పురన్దరః ॥ ౩౬ ॥

Skandaḥ skandadharo dhuryo varado vāyuvāhanaḥ
Vāsudevo br̥hadbhānurādidevaḥ purandaraḥ ॥ 36 ॥

29 సెప్టెం, 2013

330. వరదః, वरदः, Varadaḥ

ఓం వరదాయ నమః | ॐ वरदाय नमः | OM Varadāya namaḥ


వరాన్ దదాత్యభిమతాన్ వరంగాం దక్షిణామూత ।
ఇత్యచ్యుతః స వరదో గౌర్వై వర ఇతి శ్రుతేః ॥
యజమాన స్వరూపేణ హరిద్వరద ఉచ్యతే ॥

భక్తులకు అభిమతములగు వరములను ఇచ్చును. లేదా వరము అనగా యజ్ఞమునందు యజమానుడు ఋత్విజులకు ఇచ్చు దక్షిణ అని శ్రౌత సంప్రదాయము. యజ్ఞమున విష్ణువే యజమాన రూపమున నుండి ఋత్విజులకు గోరూపదక్షిణను ఇచ్చుచున్నాడు అని అర్థము.



Varān dadātyabhimatān varaṃgāṃ dakṣiṇāmūta,
Ityacyutaḥ sa varado gaurvai vara iti śruteḥ.
Yajamāna svarūpeṇa haridvarada ucyate.

वरान् ददात्यभिमतान् वरंगां दक्षिणामूत ।
इत्यच्युतः स वरदो गौर्वै वर इति श्रुतेः ॥
यजमान स्वरूपेण हरिद्वरद उच्यते ॥

He bestows the boons that are desired. Or Vara can also mean the remuneration or honorarium paid by the yajamāna i.e., the master/organizer of sacrifice. Lord Viṣṇu in the form of the yajamāna of a yajña offers the remuneration in the form of cows to the priests who perform the same.

स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः ।
वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः ॥ ३६ ॥

స్కన్దః స్కన్దధరో ధుర్యో వరదో వాయువాహనః ।
వాసుదేవో బృహద్భానురాదిదేవః పురన్దరః ॥ ౩౬ ॥

Skandaḥ skandadharo dhuryo varado vāyuvāhanaḥ ।
Vāsudevo br̥hadbhānurādidevaḥ purandaraḥ ॥ 36 ॥

28 సెప్టెం, 2013

329. ధుర్యః, धुर्यः, Dhuryaḥ

ఓం ధుర్యాయ నమః | ॐ धुर्याय नमः | OM Dhuryāya namaḥ


దురం వహతి సమస్తభూతజన్మాదిలక్షణామ్ ।
ఇతి ధుర్య ఇతి ప్రోక్తః పరమాత్మా బుధోత్తమైః ॥

సమస్త భూతములయు జన్మస్థితి నాశములను నిర్వహించుటయను భారమును వహించునుగావున ఆ పరమాత్మ ధుర్యః.



Duraṃ vahati samastabhūtajanmādilakṣaṇām,
Iti dhurya iti proktaḥ paramātmā budhottamaiḥ.

दुरं वहति समस्तभूतजन्मादिलक्षणाम् ।
इति धुर्य इति प्रोक्तः परमात्मा बुधोत्तमैः ॥

Since the Lord bears the burden of creation, sustenance and annihilation of all beings, He is with the divine name of Dhuryaḥ.

स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः ।
वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः ॥ ३६ ॥

స్కన్దః స్కన్దధరో ధుర్యో వరదో వాయువాహనః ।
వాసుదేవో బృహద్భానురాదిదేవః పురన్దరః ॥ ౩౬ ॥

Skandaḥ skandadharo dhuryo varado vāyuvāhanaḥ ।
Vāsudevo br̥hadbhānurādidevaḥ purandaraḥ ॥ 36 ॥

27 సెప్టెం, 2013

328. స్కన్దధరః, स्कन्दधरः, Skandadharaḥ

ఓం స్కన్దధరాయ నమః | ॐ स्कन्दधराय नमः | OM Skandadharāya namaḥ


స్కన్దధరః, स्कन्दधरः, Skandadharaḥ

స్కందం ధర్మపథం విష్ణుర్యో ధారయతి లీలయా ।
స స్కందధర ఇత్యుక్తో వివిధాగమ వేదిభిః ॥

స్కందమును అనగా ధర్మమార్గమును నిలుపును. 'గమనము' అను అర్థమును ఇచ్చునని మునుపటి నామ వివరణలో చెప్పబడిన 'స్కంద్‌' అను ధాతువు నుండి నిష్పన్నమగు 'స్కంద' శబ్దమునకు 'మార్గము' అను అర్థము కూడా తగిలియున్నది. దేనియందు పోవుదురో అది స్కందము లేదా మార్గము.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము ::
సీ. సృష్టిచే నెవ్వఁడు చేతనపడకుండు? సృష్టి యెవ్వని చేఁతచే జనించు?
జగములు నిద్రింప జాగరూకత నొంది యెవ్వఁడు బ్రహ్మాండ మెరుఁగుచుండు?
నాత్మకాధారంబు నఖిలంబు నెవ్వఁడౌ? నెవ్వని నిజధనం బింత వట్టు
బొడగాన రాకుండఁ బొడగును? నెవ్వఁడే నెవ్వని దృష్టికి నెదురు లేదు?
ఆ.జననవృద్ధి విలయ సంగతిఁ జెందక, యెవ్వఁ డేడపకుండు నెల్ల యెడల?
దన మహత్త్వసంజ్ఞఁ దత్త్వ మెవ్వఁడు దాన, విశ్వరూపుఁ డనఁగ విస్తరిల్లు? (10)
వ. అని మరియు నిరహంకృతుండును బుధుండును నిరాశియుఁ బరిపూర్ణుండును ననన్య ప్రేరితుండును నృశిక్షాపరుండును నిజమార్గ సంస్థితుండును నిఖిలధర్మ భావనుండునునైన పరమేశ్వరునకు నమస్కరించెద నని యుపనిషదర్థంబులు పలుకుచున్న మనువుం గనుంగొని. (11)

(స్వాయంభువ మనువు మనస్సులో భగవంతుని ఇట్లా ధ్యానించాడు). "ఎవడైతే సృష్టివల్ల చైతన్యం పొందకుండా తన చైతన్యం వల్ల సృష్టి చేస్తాడో, లోకాలు నిద్రిస్తుండగా తాను మేల్కొని బ్రహ్మాండాన్ని తెలుసుకొంటాడో, తనకు తానే ఆధారమై సమస్తమూ తానై ఉంటాడో, ఆదిమధ్యాంతాలు లేకుండా అన్నిచోట్ల చేరి ఉంటాడో, తన మహిమ చూపుతూ శాశ్వతుడై విశ్వరూపుడుగా పెరుగుతాడో, విద్వాంసుడై వినయంగా విరాజిల్లుతుతాడో, ఆశలు లేకుండా పరిపూర్ణుడై ఉంటాడో, ఇతరుల ప్రేరణ లేకుండా ఇతరులకు బోదిస్తుంటాడో, తన దారి వదలకుండా అన్ని ధర్మాలకూ కారణమై ఉంటాడో అటువంటి పరమేశ్వరునికి నమస్కారం చేస్తాను" - ఈ విధంగా ఉపనిషత్తుల పరమార్థాన్ని ప్రకటిస్తూ ధ్యానంలో ఉన్నాడు.


Skaṃdaṃ dharmapathaṃ viṣṇuryo dhārayati līlayā,
Sa skaṃdadhara ityukto vividhāgama vedibhiḥ.

स्कंदं धर्मपथं विष्णुर्यो धारयति लीलया ।
स स्कंदधर इत्युक्तो विविधागम वेदिभिः ॥

He establishes the way of dharma or path of righteousness. As was explained in the case of previous divine name, 'Skanda' also means the path that is followed.

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 1
Tamīhamānaṃ nirahaṅkr̥itaṃ budhaṃ nirāśiṣaṃ pūrṇamananyacōditam,
Nr̥iñśikṣayantaṃ nijavartmasaṃsthitaṃ prabhuṃ prapadyē’khiladharmabhāvanam. 16.

:: श्रीमद्भागवते अष्टमस्कन्धे प्रथमोऽध्यायः ::
तमीहमानं निरहङ्कृतं बुधं निराशिषं पूर्णमनन्यचोदितम् ।
नृञ्शिक्षयन्तं निजवर्त्मसंस्थितं प्रभुं प्रपद्येऽखिलधर्मभावनम् ॥ १६ ॥

Lord Kṛṣṇa works just like an ordinary human being, yet He does not desire to enjoy the fruits of work. He is full in knowledge, free from material desires and diversions, and completely independent. As the supreme teacher of human society, He teaches His own way of activities, and thus He inaugurates the real path of religion. I request everyone to follow Him.

स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः ।
वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः ॥ ३६ ॥

స్కన్దః స్కన్దధరో ధుర్యో వరదో వాయువాహనః ।
వాసుదేవో బృహద్భానురాదిదేవః పురన్దరః ॥ ౩౬ ॥

Skandaḥ skandadharo dhuryo varado vāyuvāhanaḥ ।
Vāsudevo br̥hadbhānurādidevaḥ purandaraḥ ॥ 36 ॥

26 సెప్టెం, 2013

327. స్కన్దః, स्कन्दः, Skandaḥ

ఓం స్కన్దాయ నమః | ॐ स्कन्दाय नमः | OM Skandāya namaḥ


స్కన్దః, स्कन्दः, Skandaḥ

స్కందత్యమృతరూపేణ వాయురూపేణ గచ్ఛతి ।
శోషయతీతి వా స్కంద ఇతి ప్రోక్తో హరిర్బుధైః ॥

అమృతరూపమున స్కందించును, పోవును, ప్రసరించును లేదా ప్రవహించును. వాయు రూపమున శోషింపజేయును. రెండునూ విష్ణుని విభూతులే.

స్కందిర్ - గతి శోషణయోః అను ధాతువునుండి ఈ స్కంద శబ్దము నిష్పన్నము.

:: శ్రీమద్భగవద్గీత - విశ్వరూపసందర్శనయోగము ::
వాయుర్యమోఽగ్నిర్వరుణశ్శశాఙ్కః
     ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ ।
నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః
     పునశ్చ భూయోఽపి నమో నమస్తే ॥ 39 ॥

వాయువును, యముడును, అగ్నియు, వరుణుడును, చంద్రుడును, బ్రహ్మదేవుడును, బ్రహ్మదేవునకు తండ్రియును నీవే అయియున్నావు. నీకు అనేకవేల నమస్కారములు. మఱల మఱల నీకు నమస్కారము.



Skaṃdatyamr̥tarūpeṇa vāyurūpeṇa gacchati,
Śoṣayatīti vā skaṃda iti prokto harirbudhaiḥ.

स्कंदत्यमृतरूपेण वायुरूपेण गच्छति ।
शोषयतीति वा स्कंद इति प्रोक्तो हरिर्बुधैः ॥

One who flows in the form of  Amr̥ta or nectar. Or one who dries up everything as air. Skanda has both meanings.

Śrīmad Bhagavad Gīta - Chapter 11
Vāyuryamo’gnirvaruṇaśśaśāṅkaḥ
    Prajāpatistvaṃ prapitāmahaśca,
Namo namaste’stu sahasrakr̥tvaḥ
    Punaśca bhūyo’pi namo namaste. (39)

:: श्रीमद्भगवद्गीत - विश्वरूपसंदर्शनयोगमु ::
वायुर्यमोऽग्निर्वरुणश्शशाङ्कः
     प्रजापतिस्त्वं प्रपितामहश्च ।
नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः
     पुनश्च भूयोऽपि नमो नमस्ते ॥ ३९ ॥

O flowing life of cosmic currents (Vāyu), O king of death (Yama), O god of flames (Agni), O sovereign of sea and sky (Varuna), O lord of night (the Moon), O divine father of countless offspring (Prajāpati), O ancestor of all! To you praise, praise without end! To you my salutations thousandfold.

स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः ।
वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः ॥ ३६ ॥

స్కన్దః స్కన్దధరో ధుర్యో వరదో వాయువాహనః ।
వాసుదేవో బృహద్భానురాదిదేవః పురన్దరః ॥ ౩౬ ॥

Skandaḥ skandadharo dhuryo varado vāyuvāhanaḥ ।
Vāsudevo br̥hadbhānurādidevaḥ purandaraḥ ॥ 36 ॥

25 సెప్టెం, 2013

326. ప్రతిష్ఠితః, प्रतिष्ठितः, Pratiṣṭhitaḥ

ఓం ప్రతిష్ఠితాయ నమః | ॐ प्रतिष्ठिताय नमः | OM Pratiṣṭhitāya namaḥ


ప్రతిష్ఠితః, प्रतिष्ठितः, Pratiṣṭhitaḥ

స్వేమహిమ్ని స్థితో విష్ణుః ప్రతిష్ఠిత ఇతీర్యతే ।
కస్మిన్ప్రతిష్ఠిత ఇతి సే మహిమ్నీయ యః శ్రుతః ॥

తన మహిమ లేదా మహాశక్తి యందు నిలుకడ నొందియుండువాడు గావున విష్ణువు ప్రతిష్ఠితః.

:: ఛాందోగ్యోపనిషత్ - సప్తమ ప్రపాఠకః, చతుర్వింశః ఖండః ::
యత్రనాన్యత్పశ్యతి నాన్యత్ శృణోతి నాన్యద్విజానాతి స భూమాఽథ య త్రాన్యత్పశ్య త్యస్యత్ శృణో త్యన్యద్విజానాతి తదల్పం యోవై భూమా తదమృత మథయదల్పం తన్మర్త్యం స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి స్వే మహిమ్ని యది వాన మహిమ్నితి (1)

(సనత్కుమారుడు) ఏ ఆత్మయందు, ఆత్మకంటె వేరైనది కనిపించుటలేదో, వినిపించుటలేదో, తెలియబడుటలేదో, అధియే భూమ. దీనికంటె వేరైనదంతయు అల్పము, భూమస్వరూపమగు ఆత్మ (బ్రహ్మము) నాశరహితమైనది. అల్పమైనదానికి నాశనము కలదు.

ఓ భగవాన్‌! ఆ భూమ యనునది దేనియందు ప్రతిష్ఠితమై యున్నది? అని నారదుడడిగెను.

(సనత్కుమారుడు) తన మహిమయందే తాను ప్రతిష్ఠితమైయున్నది. అది నిరాలంబము.



Svemahimni sthito viṣṇuḥ pratiṣṭhita itīryate,
Kasminpratiṣṭhita iti se mahimnīya yaḥ śrutaḥ.

स्वेमहिम्नि स्थितो विष्णुः प्रतिष्ठित इतीर्यते ।
कस्मिन्प्रतिष्ठित इति से महिम्नीय यः श्रुतः ॥

One who is supported and established in His own greatness. Established in His own eminence.

Chāndogyopaniṣat - Part VII, Chapter 24
Yatranānyatpaśyati nānyat śr̥ṇoti nānyadvijānāti sa bhūmā’tha ya trānyatpaśya tyasyat śr̥ṇo tyanyadvijānāti tadalpaṃ yovai bhūmā tadamr̥ta mathayadalpaṃ tanmartyaṃ sa bhagavaḥ kasmin pratiṣṭhita iti sve mahimni yadi vāna mahimniti (1)

:: छांदोग्योपनिषत् - सप्तम प्रपाठकः, चतुर्विंशः खंडः ::
यत्रनान्यत्पश्यति नान्यत् शृणोति नान्यद्विजानाति स भूमाऽथ य त्रान्यत्पश्य त्यस्यत् शृणो त्यन्यद्विजानाति तदल्पं योवै भूमा तदमृत मथयदल्पं तन्मर्त्यं स भगवः कस्मिन् प्रतिष्ठित इति स्वे महिम्नि यदि वान महिम्निति (१)

(Sanatkumāra) Where one sees nothing else, hears nothing else, understands nothing else - that is the
Infinite. Where one sees something else, hears something else, understands something else - that is the finite. The Infinite is immortal, the finite mortal." 

(Nārada) "Venerable Sir, in what does the Infinite find Its support?" 

(Sanatkumāra) "In Its own greatness - or not even in greatness

अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः ।
अपांनिधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः ॥ ३५ ॥

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ ౩౫ ॥

Acyutaḥ prathitaḥ prāṇaḥ prāṇado vāsavānujaḥ ।
Apāṃnidhiradhiṣṭhānamapramattaḥ pratiṣṭhitaḥ ॥ 35 ॥

24 సెప్టెం, 2013

325. అప్రమత్తః, अप्रमत्तः, Apramattaḥ

ఓం అప్రమత్తాయ నమః | ॐ अप्रमत्ताय नमः | OM Apramattāya namaḥ


అప్రమత్తః, अप्रमत्तः, Apramattaḥ

ప్రయచ్ఛనధికారిభ్యః ఫలం కర్మానురూపతః ।
న ప్రమాద్యతి యో విష్ణుస్సోఽప్రమత్త ఇతీర్యతే ॥

ఆయా ఫలములకు యోగ్యులూ, అధికారులూ అగువారికి తమ కర్మములకు తగిన ఫలమును ప్రసాదించు విషయమున ప్రమాదమును అనగా ఏమరపాటును పొందని విష్ణువు అప్రమత్తః.

:: పోతన భాగవతము తృతీయ స్కంధము ::
వ. ...నతనికి మిత్రుండును శత్రుండును బంధుండును లేఁ, డట్టి విష్ణుండు సకల జనంబులయం దావేశించి యప్రమత్తుండై ప్రమత్తులైన జనంబులకు సంహారకుండై యుండు... (972)

...అతనికి "ఇతడు మితుడు," "ఇతను శత్రుడు," "ఇతడు బంధుడూ" అంటూ ఉండరు. అట్టి విష్ణువు అందరిలో ప్రవేశించి అప్రమత్తుడై ఉంటాడు. ప్రమత్తులైన వారిని అణచివేస్తూ ఉంటాడు...



Prayacchanadhikāribhyaḥ phalaṃ karmānurūpataḥ,
Na pramādyati yo viṣṇusso’pramatta itīryate.

प्रयच्छनधिकारिभ्यः फलं कर्मानुरूपतः ।
न प्रमाद्यति यो विष्णुस्सोऽप्रमत्त इतीर्यते ॥

One who is always vigilant in awarding fruits of actions to those who are entitled to them.

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 29
Nā cāsya kaściddayitō na dvēṣyō na ca bāndhavaḥ,
Āviśatyapramattō’sau pramattaṃ janamantakr̥it. (39)

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे एकोनत्रिंशोऽध्यायः ::
ना चास्य कश्चिद्दयितो न द्वेष्यो न च बान्धवः ।
आविशत्यप्रमत्तोऽसौ प्रमत्तं जनमन्तकृत् ॥ ३९ ॥

No one is dear to Him nor is anyone His enemy or friend. But He is attentive to those who have not forgotten Him and destroys those who have.

अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः ।
अपांनिधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः ॥ ३५ ॥

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ ౩౫ ॥

Acyutaḥ prathitaḥ prāṇaḥ prāṇado vāsavānujaḥ ।
Apāṃnidhiradhiṣṭhānamapramattaḥ pratiṣṭhitaḥ ॥ 35 ॥

23 సెప్టెం, 2013

324. అధిష్ఠానమ్‌, अधिष्ठानम्‌, Adhiṣṭhānam

ఓం అధిష్ఠానాయ నమః | ॐ अधिष्ठानाय नमः | OM Adhiṣṭhānāya namaḥ


అధిష్ఠానమ్‌, अधिष्ठानम्‌, Adhiṣṭhānam

అధితిష్ఠతి భూతాని బ్రహ్మోపాదాన కారణమ్ ।
అధిష్ఠానమితి ప్రోక్తం మత్స్థానీత్యాదికస్మృతే ॥

బ్రహ్మము సకలభూతములకును ఉపాదానకారణము కావున అవి ఉత్పత్తికి ముందు ఆ బ్రహ్మ తత్త్వమును ఆశ్రయించు యుండును కావున విష్ణువు 'అధిష్ఠానమ్‌' అనదగియున్నాడు. ఆశ్రయరూపుడు.

:: శ్రీమద్భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా ।
మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ॥ 4 ॥

ఈ సమస్తప్రపంచమూ అవ్యక్తరూపుడనగు నాచే వ్యాపించబడియున్నది. సమస్తప్రాణికోట్లు నాయందున్నవి. నేను వానియందుండుటలేదు (నాకవి ఆధారములు కావు).



Adhitiṣṭhati bhūtāni brahmopādāna kāraṇam,
Adhiṣṭhānamiti proktaṃ matsthānītyādikasmr̥te.

अधितिष्ठति भूतानि ब्रह्मोपादान कारणम् ।
अधिष्ठानमिति प्रोक्तं मत्स्थानीत्यादिकस्मृते ॥

Brahman, as the material cause of everything, is their substance and support. The seat or support for everything.

Śrīmad Bhagavad Gīta - Chapter 9
Mayā tatamidaṃ sarvaṃ jagadavyaktamūrtinā,
Matsthāni sarvabhūtāni na cāhaṃ teṣvavasthitaḥ. (4)

:: श्रीमद्भगवद्गीत - राजविद्या राजगुह्य योगमु ::
मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना ।
मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थितः ॥ ४ ॥

This whole world is pervaded by Me in My unmanifest form. All beings exist in Me, but I am not contained in them (I am not supported by them).

अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः ।
अपांनिधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः ॥ ३५ ॥

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ ౩౫ ॥

Acyutaḥ prathitaḥ prāṇaḥ prāṇado vāsavānujaḥ ।
Apāṃnidhiradhiṣṭhānamapramattaḥ pratiṣṭhitaḥ ॥ 35 ॥

22 సెప్టెం, 2013

323. అపాంనిధిః, अपांनिधिः, Apāṃnidhiḥ

ఓం అపాంనిధయే నమః | ॐ अपांनिधये नमः | OM Apāṃnidhaye namaḥ


అపాంనిధిః, अपांनिधिः, Apāṃnidhiḥ

అపో యత్ర నిధీంయంతే సోఽపాంనిధి రితీర్యతే ।
సరసామస్మి సాగర ఇతి గీతాసమీరణాత్ ॥

ఆపః అనగా జలములు ఎందు ఉంచబడునో అట్టి నిధి అయిన సముద్రములు విష్ణుని విభూతియే!

:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ ।

సేనానీనామహం స్కన్దస్సరసామస్మి సాగరః ॥ 24 ॥

ఓ అర్జునా! పురోహితులలో శ్రేష్టుడగు బృహస్పతినిగా నన్నెరుంగుము. మరియు నేను సేనానాయకులలో కుమారస్వామియు (స్కందుడు), సరస్సులలో సముద్రమును అయియున్నాను.



Apo yatra nidhīṃyaṃte so’pāṃnidhi ritīryate,
Sarasāmasmi sāgara iti gītāsamīraṇāt.

अपो यत्र निधींयंते सोऽपांनिधि रितीर्यते ।
सरसामस्मि सागर इति गीतासमीरणात् ॥

The nidhi or repository of Āpaḥ i.e., waters is the great ocean. Oceans are manifestation of Lord Viṣṇu and hence He is Apāṃnidhiḥ.

Śrīmad Bhagavad Gīta - Chapter 10
Purodhasāṃ ca mukhyaṃ māṃ viddhi pārtha br̥haspatim,
Senānīnāmahaṃ skandassarasāmasmi sāgaraḥ. (24)

:: श्रीमद्भगवद्गीत - विभूति योग ::
पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम् ।
सेनानीनामहं स्कन्दस्सरसामस्मि सागरः ॥ २४ ॥

O son of Pr̥thā! Know Me to be Br̥haspati, the foremost among the priests of kings. Among commanders of armies I am Skanda (Kumāra Svāmi); among large expanses of water, I am the ocean.

अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः ।
अपांनिधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः ॥ ३५ ॥

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ ౩౫ ॥

Acyutaḥ prathitaḥ prāṇaḥ prāṇado vāsavānujaḥ ।
Apāṃnidhiradhiṣṭhānamapramattaḥ pratiṣṭhitaḥ ॥ 35 ॥

21 సెప్టెం, 2013

322. వాసవాఽనుజః, वासवाऽनुजः, Vāsavā’nujaḥ

ఓం వాసవాఽనుజాయ నమః | ॐ वासवाऽनुजाय नमः | OM Vāsavā’nujāya namaḥ


వాసవాఽనుజః, वासवाऽनुजः, Vāsavā’nujaḥ

అదిత్యాం కశ్యపాజ్జాతో వాసవస్యానుజో యతః ।
తతస్స వాసవానుజ ఇతి విద్వద్భిరుచ్యతే ॥

అదితియందు కశ్యపునకు కుమారుడుగా వామనరూపమున వాసవునకు అనగా ఇంద్రునకు తరువాత అనుజునిగా జన్మించెనుగావున వాసవాఽనుజః.

:: పోతన భాగవతము - పంచమ స్కంధము, ద్వితీయాశ్వాసము ::
సీ. ఆ క్రింద సుతలంబు నందు మహాపుణ్యుఁడగు విరోచనపుత్త్రుఁడైన యట్టి
బలిచక్రవర్తి యా పాకశాసనునకు ముద మొసంగఁగఁ గోరి, యదితిగర్భ
మున వామనాకృతిఁ బుట్టి యంతటఁ ద్రివిక్రమ రూపమునను లోకత్రయంబు
నాక్రమించిన దానవారాతిచేత ముందటన యీఁబడిన యింద్రత్వ మిట్లు
ఆ. గలుగువాఁడు పుణ్యకర్మసంధానుండు, హరిపదాంబుజార్చ నాభిలాషుఁ
డగుచుఁ శ్రీరమేశు నారాధనము సేయు, చుండు నెపుడు నతిమహోత్సవమున. (112)

'వితలం' క్రింద 'సుతలం' ఉన్నది. సుతలంలో బలిచక్రవర్తి ఉన్నాడు. అతడు పుణ్యవంతుడయిన విరోచనుని కుమారుడు. శ్రీమన్నారాయణుడు ఇంద్రుడిని సంతోషపెట్టాలనుకొని అదితిగర్భంలో వామనుడై జన్మించాడు. త్రివిక్రమరూపం ప్రదర్శించి ముల్లోకాలనూ ఆక్రమించాడు. చివరకు విష్ణువు బలిచక్రవర్తికి సుతలంలో ఇంద్రత్వం అనుగ్రహించాడు. ఆ బలిచక్రవర్తి ఎన్నో పుణ్యకర్మలు చేశాడు. శ్రీహరి పాదపద్మాలను సేవించవలెననే అభిలాష కలవాడు. అతడు ఎంతో ఉత్సాహంతో లక్ష్మీశుడయిన శ్రీమన్నారాయణున్ని ఆరాధిస్తుంటాడు.



Adityāṃ kaśyapājjāto vāsavasyānujo yataḥ,
Tatassa vāsavānuja iti vidvadbhirucyate.

अदित्यां कश्यपाज्जातो वासवस्यानुजो यतः ।
ततस्स वासवानुज इति विद्वद्भिरुच्यते ॥

Born as the anuja or younger brother of Vāsava i.e., Indra to Aditi by Kaśyapa. Hence Vāsavā’nujaḥ.

Śrīmad Bhāgavata - Canto 5, Chapter 24
Tatō’dhastātsutalē udāraśravāḥ puṇyaślōkō virōcanātmajō balirbhagavatā mahēndrasya priyaṃ cikīrṣamāṇēnāditērlabdhakāyō bhūtvā vaṭuvāmanarūpēṇa parākṣiptalōkatrayō bhagavadanukampayaiva punaḥ pravēśita indrādiṣvavidyamānayā susamr̥iddhayā śriyābhijuṣṭaḥ svadharmēṇārādhayaṃstamēva bhagavantamārādhanīyamapagatasādhvasa āstē’dhunāpi. (18)

:: श्रीमद्भागवत पञ्चमस्कन्धे चतुर्विंशोऽध्यायः ::
ततोऽधस्तात्सुतले उदारश्रवाः पुण्यश्लोको विरोचनात्मजो बलिर्भगवता महेन्द्रस्य प्रियं चिकीर्षमाणेनादितेर्लब्धकायो भूत्वा वटुवामनरूपेण पराक्षिप्तलोकत्रयो भगवदनुकम्पयैव पुनः प्रवेशित इन्द्रादिष्वविद्यमानया सुसमृद्धया श्रियाभिजुष्टः स्वधर्मेणाराधयंस्तमेव भगवन्तमाराधनीयमपगतसाध्वस आस्तेऽधुनापि ॥ १८ ॥

Below the plane Vitala is another plane known as Sutala where the great son of Mahārāja Virocana, Bali Mahārāja, who is celebrated as the most pious king, resides even now. For the welfare of Indra, the King of heaven, Lord Viṣṇu appeared in the form of a dwarf brahmacārī as the son of Aditi and tricked Bali Mahārāja by begging for only three paces of land but taking all the three worlds. Being very pleased with Bali Mahārāja for giving all his possessions, the Lord returned his kingdom and made him richer than the opulent King Indra. Even now, Bali Mahārāja engages in devotional service by worshiping the Lord Viṣṇu in the plane of Sutala.

अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः
अपांनिधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः ॥ ३५ ॥

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ ౩౫ ॥

Acyutaḥ prathitaḥ prāṇaḥ prāṇado vāsavānujaḥ
Apāṃnidhiradhiṣṭhānamapramattaḥ pratiṣṭhitaḥ ॥ 35 ॥

20 సెప్టెం, 2013

321. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ

ఓం ప్రాణదాయ నమః | ॐ प्राणदाय नमः | OM Prāṇadāya namaḥ


సురాణామసురాణాం చ దదాతి ద్యతి వా బలమ్ ।
ప్రాణమిత్యచ్యుతః ప్రాణదః ఇతి ప్రోచ్యతే బుధైః ॥

సురులకూ, అసురులకూ ప్రాణము అనగా బలమును ఇచ్చువాడూ, ఆ బలమును తొలగించి వారిని ఖండించువాడు ప్రాణదః.

65. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ



Surāṇāmasurāṇāṃ ca dadāti dyati vā balam,
Prāṇamityacyutaḥ prāṇadaḥ iti procyate budhaiḥ.

सुराणामसुराणां च ददाति द्यति वा बलम् ।
प्राणमित्यच्युतः प्राणदः इति प्रोच्यते बुधैः ॥

One who bestows Prana i.e., strength on Devas and Asuras and also destroys them by withdrawing it.

65. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ

अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः ।
अपांनिधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः ॥ ३५ ॥

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ ౩౫ ॥

Acyutaḥ prathitaḥ prāṇaḥ prāṇado vāsavānujaḥ ।
Apāṃnidhiradhiṣṭhānamapramattaḥ pratiṣṭhitaḥ ॥ 35 ॥

19 సెప్టెం, 2013

320. ప్రాణః, प्राणः, Prāṇaḥ

ఓం ప్రాణాయ నమః | ॐ प्राणाय नमः | OM Prāṇāya namaḥ


ప్రాణః, प्राणः, Prāṇaḥ

భగవాన్ యః ప్రాణయతి ప్రజాస్సూత్రాత్మనేతి సః ।
ప్రాణ ఇచ్యుచ్యతే విష్ణుః ప్రాణో వేతి హి బహ్వృచః ॥

హిరణ్యగర్భ రూపుడుగా తానే ప్రజలను ప్రాణించ/జీవించ జేయుచున్నాడు.

:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము ::
సీ. అట్టి విరాడ్విగ్రహాంత రాకాశంబు వలన నోజస్సహోబలము లయ్యెఁ
బ్రాణంబు సూక్ష్మరూపక్రియా శక్తిచే జనియించి ముఖ్యాసు వనఁగఁ బరఁగె
వెలువడి చను జీవి వెనుకొని ప్రాణముల్ సనుచుండు నిజనాథు ననుసరించు
భటులు చందంబునఁ, బాటిల్లు క్షుత్తును భూరితృష్ణయు మఱి ముఖమువలనఁ
తే. దాలు జిహ్వాదికంబు లుద్భవము నొందె, నందు నుదయించె నానావిధైక రసము,
లెనయ నవి యెల్ల జిహ్వచే నెరుఁగఁబడును, మొనసి పలుక నపేక్షించు ముఖమువలన. (268)

అలాంటి విరాట్పురుషుని శరీరంలోపలి ఆకాశం నుండి ప్రవృత్తి సామర్థ్యరూపమైన ఓజస్సు, వేగసామర్థ్యం, బలం అనే ధర్మాలు కలిగాయి. సూక్ష్మరూపమైన క్రియాశక్తి వలన ప్రాణము పుట్టినది. అదే సమస్త ప్రాణులకూ ముఖ్యమైనది. యజమాని ననుసరించే సేవకులలాగా ప్రాణాలు జీవి ననుసరించి వెడలిపోతూ ఉంటాయి. విరాట్పురుషునకు జఠరాగ్ని దీపించగానే ఆకలిదప్పికలు ఏర్పడ్డాయి. ముఖం నుండి దవుడలు, నాలుక మొదలైనవి పుట్టాయి. అందుండే ఆరువిధాలైన రసాలు జనించాయి. ఆ రసభేదాలన్నీ నాలుకతోనే గ్రహింపబడుతున్నాయి. ముఖం సంభాషించాలని కోరినది.

66. ప్రాణః, प्राणः, Prāṇaḥ



Bhagavān yaḥ prāṇayati prajāssūtrātmaneti saḥ,
Prāṇa icyucyate viṣṇuḥ prāṇo veti hi bahvr̥caḥ.

भगवान् यः प्राणयति प्रजास्सूत्रात्मनेति सः ।
प्राण इच्युच्यते विष्णुः प्राणो वेति हि बह्वृचः ॥

One who as Hiraṇyagarbha endows all beings with Prāṇa.

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 10
Eko nānātvamanvicchanyogatalpātsamutthitaḥ,
Vīryaṃ hiraṇmayaṃ devo māyayā vyasr̥jattridhā. (13)
Adhidaivamathādhyātmamadhibhūtamiti prabhuḥ,
Athaikaṃ pauruṣaṃ vīryaṃ tridhābhidyata tacchr̥ṇu. (14)
Antaḥ śarīra ākāśātpuruṣasya viceṣṭataḥ,
Ojaḥ saho balaṃ jajñe tataḥ prāṇo mahānasuḥ. (15)

:: श्रीमद्भागवते द्वितीय स्कन्धे दश्मोऽध्यायः ::
एको नानात्वमन्विच्छन्योगतल्पात्समुत्थितः ।
वीर्यं हिरण्मयं देवो मायया व्यसृजत्त्रिधा ॥ १३ ॥
अधिदैवमथाध्यात्ममधिभूतमिति प्रभुः ।
अथैकं पौरुषं वीर्यं त्रिधाभिद्यत तच्छृणु ॥ १४ ॥
अन्तः शरीर आकाशात्पुरुषस्य विचेष्टतः ।
ओजः सहो बलं जज्ञे ततः प्राणो महानसुः ॥ १५ ॥

The Lord, while lying on His bed of mystic slumber, generated the seminal symbol, golden in hue, through external energy out of His desire to manifest varieties of living entities from Himself alone. Just hear from me how the potency of His Lordship divides one into three, called the controlling entities, the controlled entities and the material bodies, in the manner mentioned above. From the sky situated within the transcendental body of the manifesting Mahā-Viṣṇu, sense energy, mental force and bodily strength are all generated, as well as the sum total of the fountainhead of the total living force.

66. ప్రాణః, प्राणः, Prāṇaḥ

अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः ।
अपांनिधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः ॥ ३५ ॥

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ ౩౫ ॥

Acyutaḥ prathitaḥ prāṇaḥ prāṇado vāsavānujaḥ ।
Apāṃnidhiradhiṣṭhānamapramattaḥ pratiṣṭhitaḥ ॥ 35 ॥

18 సెప్టెం, 2013

319. ప్రథితః, प्रथितः, Prathitaḥ

ఓం ప్రథితాయ నమః | ॐ प्रथिताय नमः | OM Prathitāya namaḥ


ప్రథితః, प्रथितः, Prathitaḥ

విశ్వోత్పత్త్యాదిభిఃఖ్యాతః కర్మభిః ప్రథితః స్మృతః తాను చేయు జగదుత్పత్తి, స్థితి, లయ కర్మలచేత ప్రసిద్ధిని పొందినవాడు.

:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::
సీ. దేవ! జగన్మయ! దేవేశ! జగదీశ! కాలజగద్వ్యాపకస్వరూప!
యఖిల భావములకు నాత్మయు హేతువు నైన యీశ్వరుఁడ వాద్యంతములును
మధ్యంబు బయలును మఱి లోపలయు లేక పూర్ణమై యమృతమై భూరిసత్య
మానంద చిన్మాత్ర మవికార మాద్య మనన్య మశోకంబు నగుణ మఖిల
తే. సంభవస్థితి లయముల దంభకంబు, నైన బ్రహ్మంబు నీవ; నీ యంఘ్రియుగము
నుభయ సంగ విసృష్టులై యున్న మునులు, గోరి కైవల్యకాములై కొల్తు రెపుడు. (385)

దేవ దేవా! వాసుదేవా! జగదీశ్వరా! ఎల్లప్పుడూ లోకాలతో నిండి ఉండే వాడవు. సమస్త వస్తువులకూ కారణభూతుడవైన ప్రభువు నీవే! ఆదిమధ్యాంతాలు లేకుండా లోపలా వెలుపలా అంతటా నిండిన వాడవు నీవు. పరిపూర్ణమైన సత్యం నీవు. ఆనందంతో కూడిన జ్ఞానం నీవు. మార్పులేని మూలవస్తువు నీవు. దుఃఖదూరుడవు, గుణాతీతుడవు. అన్నింటి పుట్టుకకూ, మనుగడకూ, నాశనానికి కారణం నీవు. మాయతో కూడిన పరమాత్మవు నీవు. మోక్షాన్ని కోరేవారు స్వార్థాన్నీ, అహంకారాన్నీ విడిచి ఎల్లప్పుడూ నీ పాదాలను సేవిస్తారు.



Viśvotpattyādibhiḥkhyātaḥ karmabhiḥ prathitaḥ smr̥taḥ / विश्वोत्पत्त्यादिभिःख्यातः कर्मभिः प्रथितः स्मृतः Famous by reason of the actions of creation, preservation and annihilation of the world.

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 17
Viśvāya viśvabhavanasthitisaṃyamāya
     Svairaṃ gr̥hītapuruśaktiguṇāya bhūmne,
Svasthāya śaśvadupabr̥ṃhitapūrṇabodha
     Vyāpāditātmatamase haraye namaste. (9)

:: श्रीमद्भागवते अष्टमस्कन्धे सप्तदशोऽध्यायः ::
विश्वाय विश्वभवनस्थितिसंयमाय
     स्वैरं गृहीतपुरुशक्तिगुणाय भूम्ने ।
स्वस्थाय शश्वदुपबृंहितपूर्णबोध
     व्यापादितात्मतमसे हरये नमस्ते ॥ ९ ॥ 

My Lord, You are the all-pervading universal form, the fully independent creator, maintainer and destroyer of this universe. Although You engage Your energy in matter, You are always situated in Your original form and never fall from that position, for Your knowledge is infallible and always suitable to any situation. You are never bewildered by illusion. O my Lord Hari, let me offer my respectful obeisances unto You.

अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः ।
अपांनिधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः ॥ ३५ ॥

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ ౩౫ ॥

Acyutaḥ prathitaḥ prāṇaḥ prāṇado vāsavānujaḥ ।
Apāṃnidhiradhiṣṭhānamapramattaḥ pratiṣṭhitaḥ ॥ 35 ॥

17 సెప్టెం, 2013

318. అచ్యుతః, अच्युतः, Acyutaḥ

ఓం అచ్యుతాయ నమః | ॐ अच्युताय नमः | OM Acyutāya namaḥ


అచ్యుతః, अच्युतः, Acyutaḥ

ఉక్తో జన్మాదిషడ్భావవికారరహితోఽచ్యుతః ।
శాశ్వతం శివమచ్యుతమిత్యాదిశ్రుతివాక్యతః ॥

తన యథాస్వరూపస్థితినుండి తొలగడు. షడ్భావవికారములు (ఉనికీ, పుట్టుట, పెరుగుట, తరుగుట, పరిణమించుట మరియూ నశించుట) లేనివాడు.

:: నారాయణీయా యాజ్ఞిక్యుపనిషత్ - త్రయోదశోఽనువాకః ::
పతిం విశ్వస్యాత్మేశ్వరగ్‍ం శాశ్వతగ్‍ం శివ మచ్యుతమ్ ।
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్ ॥ 113 ॥

జగత్తునకు ప్రభువూ, జీవులకు ఈశ్వరుడూ, నిరంతరమూ ఉన్నవాడూ, మంగళుడూ, తన స్థితినుండి ఎన్నడూ జారనివాడూ, పంచభూతాత్మకుడూ, జ్ఞేయములలో గొప్పవాడూ, జగదాత్మకుడూ, ఉత్కృష్టమైన ఆధారుడు.

100. అచ్యుతః, अच्युतः, Acyutaḥ



Ukto janmādiṣaḍbhāvavikārarahito’cyutaḥ,
Śāśvataṃ śivamacyutamityādiśrutivākyataḥ.

उक्तो जन्मादिषड्भावविकाररहितोऽच्युतः ।
शाश्वतं शिवमच्युतमित्यादिश्रुतिवाक्यतः ॥

Unchanging. He is devoid of the six changes viz., birth, existence, growth, transformation, decline and death.

Nārāyaṇīyā Yājñikyupaniṣat - Chapter 13
Patiṃ viśvasyātmeśvaragˈṃ śāśvatagˈṃ śiva macyutam,
Nārāyaṇaṃ mahājñeyaṃ viśvātmānaṃ parāyaṇam. (113)

:: नारायणीया याज्ञिक्युपनिषत् - त्रयोदशोऽनुवाकः ::
पतिं विश्वस्यात्मेश्वरग्‍ं शाश्वतग्‍ं शिव मच्युतम् ।
नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् ॥ ११३ ॥

The protector of the universe, the Lord of all Souls (or Lord over Self), the perpetual, the auspicious, the indestructible, the Goal of all creation, the Supreme object worthy of being known, the Soul of all beings, the Refuge unfailing (is He).

100. అచ్యుతః, अच्युतः, Acyutaḥ

अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः ।
अपांनिधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः ॥ ३५ ॥

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ ౩౫ ॥

Acyutaḥ prathitaḥ prāṇaḥ prāṇado vāsavānujaḥ ।
Apāṃnidhiradhiṣṭhānamapramattaḥ pratiṣṭhitaḥ ॥ 35 ॥

16 సెప్టెం, 2013

317. మహీధరః, महीधरः, Mahīdharaḥ

ఓం మహీధరాయ నమః | ॐ महीधराय नमः | OM Mahīdharāya namaḥ


మహీధరః, महीधरः, Mahīdharaḥ

మహీం పూజ్యాం ధరణీం వాధరతీతి మహీధరః మహీ శబ్దమునకు పూజా అని అర్థము. భక్తులు చేయు పూజను ధరించును. లేదా మహి అనగా భూమి అని కూడా అర్థము. కావున మహిని లేదా భూమిని ధరించును.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
చ. సకల జగన్నియానుక విచక్షణలీలఁ దనర్చునట్టి నం
     దకధర! తావక స్ఫురదుదారత మంత్రసమర్థు డైన యా
     జ్ఞికుఁ డరణిన్ హుతాశనుని నిల్పిన కైవడి మన్నివాస మౌ
     టకుఁ దలపోసి యీ క్షితి దృఢంబుగ నిల్పితివయ్య యీశ్వరా! (434)

"నందకము" అనే ఖడ్గాన్ని ధరించిన ముకుందా! నేర్పుతో సకలలోకాలను ఒక నియమబద్ధంగా ఏర్పాటుచేసిన నేర్పరివి. మంత్రసిద్ధుడైన యాజ్ఞికుడు అరణియందు అగ్నిని నిల్పినట్లు నీవు దయపూని మేము నిలబడి మనుగడ సాగించడానికి ఈ భూమిని ఈ విధంగా సుస్థిరంగా నిలబెట్టావు! ఎంతటి ఔదార్యం ప్రకటించావు స్వామీ!



Mahīṃ pūjyāṃ dharaṇīṃ vādharatīti mahīdharaḥ / महीं पूज्यां धरणीं वाधरतीति महीधरः Mahī means both worship and earth. Hence the divine name can mean One who receives all forms of worship or the One who supports earth.

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 13
Utkṣiptavālaḥ khacaraḥ kaṭhoraḥ saṭā vidhunvanˈkhararomaśatvak,
Khurāhatābhraḥ sitadaṃṣṭra īkṣā jyotirbabhāse bhagavānmahīdhraḥ. (27)

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे त्रयोदशोऽध्यायः ::
उत्क्षिप्तवालः खचरः कठोरः सटा विधुन्वन्‍खररोमशत्वक् ।
खुराहताभ्रः सितदंष्ट्र ईक्षा ज्योतिर्बभासे भगवान्महीध्रः ॥ २७ ॥

Before entering the water to rescue the earth, Lord Boar flew in the sky, slashing His tail, His hard hairs quivering. His very glance was luminous and He scattered the clouds in the sky with His hooves and His glittering white tusks.

इष्टोऽविशिष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः ।
क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viśiṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ ।
Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

15 సెప్టెం, 2013

316. విశ్వబాహుః, विश्वबाहुः, Viśvabāhuḥ

ఓం విశ్వబాహవే నమః | ॐ विश्वबाहवे नमः | OM Viśvabāhave namaḥ


విశ్వబాహుః, विश्वबाहुः, Viśvabāhuḥ

విశ్వాలంబనత్వేన వా విశ్వే బాహవోఽస్యవా ।
విశ్వతో బాహవోఽస్యేతి విశ్వబాహురితీర్యతే ॥

ఎల్ల ప్రాణులకును బాహువు వలె ఆలంబనముగా ఉన్న ఆ పరమాత్ముడు లోకరక్షకుడు కదా! లేదా అన్నియూ ఈతని భుజములే.

:: శ్వేతాశ్వతరోపనిషత్ - తృతీయోఽధ్యాయః ::
విశ్వతశ్చక్షు రుత విశ్వతో ముఖో విశ్వతో బాహురుత విశ్వతస్పాత్ ।
సంబాహుభ్యాం ధమతి సంపతత్రైః ద్యావా పృథివీ జనయన్దేవ ఏకః ॥ 3 ॥

ఆత్మదేవుడును అద్వితీయుడునగు పరమాత్మ ఆకాశమును భూమిని పుట్టించుచున్నవాడై అంతటను నేత్రములు గలవాడుగానున్నాడు. మరియూ అంతటా ముఖములు గలవాడునూ, అంతటా బాహువులు గలవాడునూ, అంతటా పాదములు కలవాడునూ అయి, బాహువులతో మనుష్యులను చేర్చుచున్నాడు. ఱెక్కలతో పక్షులను చేర్చుచున్నాడు.



Viśvālaṃbanatvena vā viśve bāhavo’syavā,
Viśvato bāhavo’syeti viśvabāhuritīryate.

विश्वालंबनत्वेन वा विश्वे बाहवोऽस्यवा ।
विश्वतो बाहवोऽस्येति विश्वबाहुरितीर्यते ॥

With arms as support of all, He is Viśvabāhu. Or He has arms on all sides.

:: Śvetāśvataropaniṣat - tr̥tīyo’dhyāyaḥ ::
Viśvataścakṣu ruta viśvato mukho viśvato bāhuruta viśvataspāt,
Saṃbāhubhyāṃ dhamati saṃpatatraiḥ dyāvā pr̥thivī janayandeva ekaḥ. (3)

:: श्वेताश्वतरोपनिषत् - तृतीयोऽध्यायः ::
विश्वतश्चक्षु रुत विश्वतो मुखो विश्वतो बाहुरुत विश्वतस्पात् ।
संबाहुभ्यां धमति संपतत्रैः द्यावा पृथिवी जनयन्देव एकः ॥ ३ ॥

His eyes are everywhere, His faces everywhere, His arms everywhere, everywhere His feet. He it is who endows men with arms, birds with feet and wings and men likewise with feet. Having produced heaven and earth, He remains as their non-dual manifester.

इष्टोऽविशिष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः ।
क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viśiṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ ।
Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

14 సెప్టెం, 2013

315. క్రోధకృత్‌కర్తా, क्रोधकृत्‌कर्ता, Krodhakr̥tˈkartā

ఓం క్రోధకృత్‌కర్త్రే నమః | ॐ क्रोधकृत्‌कर्त्रे नमः | OM Krodhakr̥tˈkartre namaḥ


క్రోధకృత్‌: అసాధుషు విషయే క్రోధం కరోతి అసాధుజనుల విషయమున క్రోధమును కలిగించును.

కర్తా: కరోతి ఇతి కర్తాః చేయువాడు కావున కర్తా. దేనిని చేయువాడు అను ప్రశ్న రాగా క్రియతే (సృజ్యతే) ఇతి కర్మ జగత్ చేయబడునదీ, సృజించబడునదీ కావున జగత్తు 'కర్మము' మనబడును. అట్టి కర్మమునూ, జగత్తునూ చేయును. జగత్తు సృజన, పోషణ మరియూ సంహారములు చేయును.

క్రోధకృత్‌కర్తా: క్రోధ కృతాం కర్తా; సాధుషు విషయే క్రోధం కుర్వతః దైత్యాదీన్ కృతంతి ఇతి క్రోధకృత్‌కర్తా సాధుజనుల విషయమున క్రోధ ప్రదర్శన చేయు దైత్యాదులను ఛేదించును. అని ఇట్లు రెండును కలిసి ఒకే నామము.



Krodhakr̥t: Asādhuṣu viṣaye krodhaṃ karoti / असाधुषु विषये क्रोधं करोति He who causes anger in the evil persons.

Kartā: Karoti iti kartāḥ / करोति इति कर्ताः What is done or created is action i.e., the world; the creator of the worlds is kartā.

Krodhakr̥tˈkartā: Krodha kr̥tāṃ kartā; sādhuṣu viṣaye krodhaṃ kurvataḥ daityādīn kr̥taṃti iti krodhakr̥tkartā / क्रोध कृतां कर्ता; साधुषु विषये क्रोधं कुर्वतः दैत्यादीन् कृतंति इति क्रोधकृत्कर्ता As one name may be interpreted as the One who is slayer of the the asurās or evil men who torment others.

इष्टोऽविशिष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः ।
क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viśiṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ ।
Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

13 సెప్టెం, 2013

314. క్రోధహా, क्रोधहा, Krodhahā

ఓం క్రోధఘ్నే నమః | ॐ क्रोधघ्ने नमः | OM Krodhaghne namaḥ


క్రోధహా, क्रोधहा, Krodhahā

సాధూనాం హంతి యః క్రోధం క్రోధహేతి స ఉచ్యతే సాధుజనుల క్రోధమును నశింపజేయును.

పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వభాగము ::
ఉ. ఒల్లరు నిర్జరేంద్రపద మొల్లరు బ్రహ్మపదంబు నొందఁగా
నొల్లరు చక్రవర్తిపద మొల్లరు సర్వరసాధిపత్యము
నొల్లరు యోగసిద్ధి మఱి యొండు భవంబుల నొందనీని నీ
సల్లలితాంఘ్రి రేణువుల సంగతి నొందిన ధన్యు లెప్పుడున్‌. (678)
క. ఘనసంసారరహతులగు, జను లాకాంక్షింపఁ గడు నశక్యం బగు శో
భనము సమక్షంబున నహి, గనియోం దామసుఁడు రోషకలితుం డయ్యున్‍. (679)

అతిమనోహరములైన నీ పాదరేణువుల స్పర్శ పొందిన ధన్యులు దేవేంద్రపదవిని ఇష్టపడరు. బ్రహ్మపదవి గానీ, చక్రవర్తి పదవిని గానీ కోరరు. వరుణుని పదవినిగానీ, యోగసిద్ధినిగానీ ఇష్టపడరు. అటువంటి నీ పాదరేణువుల స్పర్శ ఏ జన్మలోనూ ఎవరూ పొందలేనిది.

ఎంతో గొప్ప సంసార భారంచేత క్రుంగిపోయిన జనులు కోరడానికి కూడా సాధ్యంకాని పరమశుభం నీ పాదస్పర్శ. అటువంటి భాగ్యాన్ని ఈ కాళీయుడు - క్రోధం నిండినవాడు, రోషం నిండినవాడూ అయిన ఈ సర్పరాజు పొందగలిగాడు. ఇది నీ సాన్నిధ్యంయొక్క మహిమ!



Sādhūnāṃ haṃti yaḥ krodhaṃ krodhaheti sa ucyate / साधूनां हंति यः क्रोधं क्रोधहेति स उच्यते He eradicates anger of the virtuous.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 16
Tadeṣa nāthāpa durāpamanyaistamojaniḥ krodhavaśo’pyahīśaḥ,
Saṃsāracakre bhramataḥ śarīriṇo yadicchataḥ syādvibhavaḥ samakṣaḥ. (38)

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे षोडशोऽध्यायः ::
तदेष नाथाप दुरापमन्यैस्तमोजनिः क्रोधवशोऽप्यहीशः ।
संसारचक्रे भ्रमतः शरीरिणो यदिच्छतः स्याद्विभवः समक्षः ॥ ३८ ॥

O Lord! Although (Kāḷīya) the king of the serpents, has taken birth in the mode of ignorance and is controlled by anger, he has achieved that which is difficult for others to achieve. Embodied souls, who are full of desires and are thus wandering in the cycle of birth and death, can have all benedictions manifested before their eyes simply by receiving the dust of Your lotus feet.

इष्टोऽविशिष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः ।
क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viśiṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ ।
Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

12 సెప్టెం, 2013

313. వృషః, वृषः, Vr̥ṣaḥ

ఓం వృషాయ నమః | ॐ वृषाय नमः | OM Vr̥ṣāya namaḥ


వృషః, वृषः, Vr̥ṣaḥ

హరిర్ధర్మస్వరూపేణ కామానాం వర్షణాద్వృషః కామ ఫలములను వర్షించును కావున ధర్మమునకు 'వృషః' అని వ్యవహారము. నారాయణుడు అట్టి ఉత్తమ వృషస్వరూపుడు.

:: మహాభారతే శాంతి పర్వణి, మోక్షధర్మపర్వణి ద్విచత్వారింషదధికత్రిశతతమోఽధ్యాయః ::
వృషో హి భగవాన్ ధర్మః ఖ్యాతో లోకేషు భారత ।
నైఘణ్టుకపదాఖ్యానే విద్ధి మాం వృషముత్తమమ్ ॥ 88 ॥

భరత వంశ సంజాతా (అర్జునుడు)! నిఘంటుకారులు చేయు పదనిర్వచనముల ననుసరించి భగవానుడగు ధర్ముడు 'వర్షతి' అను వ్యుత్పత్తిచే 'వృషః' అని లోకములందు తలచబడుచున్నాడు. అందుచేతనే నన్ను (శ్రీకృష్ణుడు) ఉత్తమవృషమునుగానే ఎరుగుము.



Harirdharmasvarūpeṇa kāmānāṃ varṣaṇādvr̥ṣaḥ / हरिर्धर्मस्वरूपेण कामानां वर्षणाद्वृषः As Dharma or righteousness leads to fulfillment of desires as if it is raining, it is known as 'Vr̥ṣaḥ'. Lord Hari is the ultimate manifestation of the same and hence He is addressed as 'Vr̥ṣaḥ'.

Mahābhārata  - Śānti Parva, Mokṣadharma Parva, Chapter 342
Vr̥ṣo hi bhagavān dharmaḥ khyāto lokeṣu bhārata,
Naighaṇṭukapadākhyāne viddhi māṃ vr̥ṣamuttamam. (88)

:: महाभारते शांति पर्वणि, मोक्षधर्मपर्वणि द्विचत्वारिंषदधिकत्रिशततमोऽध्यायः ::
वृषो हि भगवान् धर्मः ख्यातो लोकेषु भारत ।
नैघण्टुकपदाख्याने विद्धि मां वृषमुत्तमम् ॥ ८८ ॥

The worshipful Dharma is considered in the world as Vr̥ṣa. The lexicographers speak of Vr̥ṣa as dharma. Know Me to be noblest Vr̥ṣa.

इष्टोऽविशिष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः
क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viśiṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ
Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

11 సెప్టెం, 2013

312. నహుషః, नहुषः, Nahuṣaḥ

ఓం నహుషాయ నమః | ॐ नहुषाय नमः | OM Nahuṣāya namaḥ


నహ్యతి భూతాని మాయయా ప్రాణులను తన మాయచే బంధించును.



Nahyati bhūtāni māyayā / नह्यति भूतानि मायया As He binds all creatures by His power of māya, He is Nahuṣaḥ, the great binder.

इष्टोऽविष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः ।
क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ ।
Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

10 సెప్టెం, 2013

311. శిఖండీ, शिखंडी, Śikhaṃḍī

ఓం శిఖండినే నమః | ॐ शिखंडिने नमः | OM Śikhaṃḍine namaḥ


శిఖండీ, शिखंडी, Śikhaṃḍī

అలంకారశ్శిఖండోఽస్య గోపవేషధరస్య యత్ ।
తచ్ఛిఖండీతి విద్వద్భిః పరమేశ్వర ఉచ్యతే ॥

గోపవేషధరుడగు ఈతనికి (శ్రీ కృష్ణుడు) శిఖండము అనగా నెమిలిపించెము అలంకారముగా కలదు కనుక ఆ పరమేశ్వరుడైన విష్ణునకు శిఖండీ అను నామముగలదు.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వ భాగము ::
సీ. శంపాలతికతోడి జలదంబు కైవడి మెఱుఁగు టొల్లియతోడి మేనివానిఁ
గమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాణ వేణుచిహ్నంబులు వెలయువానిఁ
గుంజా వినిర్మిత కుండలంబులవాని శిఖిపించితవేష్టిత శిరమువాని
వనపుష్పమాలికా వ్రాత కంఠమువాని నలినకోమల చరణములవానిఁ
ఆ. గరుణ గడలుకొనిన కడగంటివాని గో, పాలబాలుభంగిఁ బరఁగువాని
నగుమొగంబువాని నన్నుఁగన్న తండ్రిని, నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష! (548)

మెరుపుతీగెతో కూడిన మేఘంవలె నీ శరీరం బంగారు రంగు ఉత్తరీయంతో ప్రకాశిస్తున్నది. నీ చేతిలో ఉన్న చలిదిముద్ద మృదువుగా అందంగా ఉన్నది. వెదురుకర్ర, కొమ్ముబూర, మురళి, మొదలైన వాటితో ప్రకాశిస్తున్నావు. ఏనుగు దంతంతో తయారైన నీ కుండలాలు, నెమలిపిఛంతో చుట్టబడిన నీ శిరస్సు, అడవి పువ్వుల మాలికతో అలంకరించబడిన నీ కంఠం, తామరపువ్వులవలె సున్నితములైన నీ పాదాలు ఎంతో అందంగా ఉన్నాయి. అదిగో కడగంటితో నన్ను చూస్తున్న నీ చూపులో కరుణ తొణికిసలాడుతున్నది. నీ గోపాల బాలుని రూపాన్ని నేను స్తుతిస్తూ ఉంటే నన్ను చూచి నవ్వుతున్న నీ ముఖం చాలా రమణీయంగా ఉన్నది. కమల దళాలవంటి కన్నులు గల నీవు నన్ను కన్న తండ్రివని ఇప్పుడు గుర్తించాను. నీకు మ్రొక్కి నిన్ను సేవించుకుంటున్నాను.



Alaṃkāraśśikhaṃḍo’sya gopaveṣadharasya yat,
Tacchikhaṃḍīti vidvadbhiḥ parameśvara ucyate.

अलंकारश्शिखंडोऽस्य गोपवेषधरस्य यत् ।
तच्छिखंडीति विद्वद्भिः परमेश्वर उच्यते ॥

Śikhanḍaṃ means feather of a peacock. One who used it as a decoration for his crown during His incarnation as a cowherd i.e., Lord Kr̥ṣṇa is Śikhaṃḍī.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 21
Barhāpīḍaṃ naṭavaravapuḥ karṇayōḥ karṇikāraṃ
     Bibhradvāsaḥ kanakakapiśaṃ vaijayantī ca mālām,
Randhrānvēṇōradharasudhayāpūrayangōpavr̥indair
     R̥indāraṇyaṃ svapadaramaṇaṃ prāviśagdītakīrtiḥ. 5.

:: श्रीमद्भागवते - दशमस्कन्धे पूर्वार्धे एकविंषोऽध्यायः ::
बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं
     बिभ्रद्वासः कनककपिशं वैजयन्ती च मालाम् ।
रन्ध्रान्वेणोरधरसुधयापूरयन्गोपवृन्दैर्‌
     ऋन्दारण्यं स्वपदरमणं प्राविशग्दीतकीर्तिः ॥ ५ ॥

Wearing a peacock-feather ornament upon His head, blue karnikara flowers on His ears, a yellow garment as brilliant as gold, and the Vaijayanti garland, Lord Krishna exhibited His transcendental form as the greatest of dancers as He entered the forest of Vrindavana, beautifying it with the marks of His footprints. He filled the holes of His flute with the nectar of His lips, and the cowherd boys sang His glories.

इष्टोऽविशिष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः ।
क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viśiṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ ।
Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

9 సెప్టెం, 2013

310. శిష్టేష్టః, शिष्टेष्टः, Śiṣṭeṣṭaḥ

ఓం శిష్టేష్టాయ నమః | ॐ शिष्टेष्टाय नमः | OM Śiṣṭeṣṭāya namaḥ


శిష్టేష్టః, शिष्टेष्टः, Śiṣṭeṣṭaḥ

శిష్టానాం విదుషామిష్టో భగవాన్ పరమేశ్వరః ।
శిష్టైరిష్టోఽర్చిత ఇతి వా శిష్టేష్ట ఇతీర్యతే ॥

శిష్టులకు అనగా విద్వాంసులకూ, తత్త్వజ్ఞులకూ ఇష్టుడు. యజ్ఞయాగాది క్రతువులద్వారా పూజింపబడుతాడు. లేదా శిష్టులు ఎవనికి ఇష్టులో అట్టివాడు.

:: శ్రీమద్భగవద్గీత - విజ్ఞాన యోగమ్ ::
తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ।
ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః ॥ 17 ॥

వారిలో (ఆపత్తునందున్నవాడూ, భగవంతుని తెలిసికొనగోరువాడూ, ధనమునభిలషించువాడూ మరియూ ఆత్మ జ్ఞానముగలవాడు) నిత్యమూ పరమాత్మతో గూడియుండువాడునూ, ఒక్క పరమాత్మయందే భక్తిగలవాడునూనగు జ్ఞాని శ్రేష్ఠుడగుచున్నాడు. అట్టి జ్ఞానికి నేను మిక్కిలు ఇష్టమైనవాడను; అతడున్నూ నాకు మిగుల ఇష్టుడే.



Śiṣṭānāṃ viduṣāmiṣṭo bhagavān parameśvaraḥ,
Śiṣṭairiṣṭo’rcita iti vā śiṣṭeṣṭa itīryate.

शिष्टानां विदुषामिष्टो भगवान् परमेश्वरः ।
शिष्टैरिष्टोऽर्चित इति वा शिष्टेष्ट इतीर्यते ॥ 

One who is dear to to śiṣṭas or the learned ones. Or it also can mean the One to who the jñānīs or the learned persons are dear.

Śrīmad Bhagavadgīta - Chapter 7
Teṣāṃjñānī nityayukta ekabhaktirviśiṣyate,
Priyo hi jñānino’tyarthamahaṃ sa ca mama priyaḥ. (17)

:: श्रीमद्भगवद्गीत - विज्ञान योगम् ::
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ।
प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ॥ १७ ॥

Chief among these four kinds of men (the afflicted, the questers of wisdom, the cravers of wealth and the wise) is the sage, ever constant and one-pointed in devotion. For I am exceedingly dear to the sage and he is exceedingly dear to Me.

इष्टोऽविशिष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः ।
क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viśiṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ ।
Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

8 సెప్టెం, 2013

309. అవిశిష్టః, अविशिष्टः, Aviśiṣṭaḥ

ఓం అవిశిష్టాయ నమః | ॐ अविशिष्टाय नमः | OM Aviśiṣṭāya namaḥ


అవిశిష్టః, अविशिष्टः, Aviśiṣṭaḥ

అవిశిష్టః అసమస్తానామంతర్యామితయా హరిః. సర్వేషాం అంతర్యామిత్వేన - అవిశిష్టః ఎల్ల ప్రాణులకును ఎల్ల పదార్థములకును అంతర్యామి అనగా లోపలగా ఉండుచు వానిని తమ తమ వ్యాపారములందు ప్రవర్తిల్లజేయుచూ అదుపులోనుంచువాడు కావున హరి అవిశిష్టుడు. ఏ భేదమును లేక అంతటను సమరూపముతో నుండువాడు.

:: పోతన భాగవతము - సప్తమ స్కంధము ::
వ. కావున విషయంబులఁ జిక్కువడిన రక్కసులకు హరిభజనంబు శక్యంబు గాదు, రమ్యమయ్యును బహుతర ప్రయాస గమ్యమని తలంచితిరేనిఁ జెప్పెద, సర్వభూతాత్మకుండైన సర్వ దిక్కాల సిద్ధుండై బ్రహ్మ కడపలగాఁ గల చరాచర స్థూల సూక్ష్మజీవసంఘంబు లందును, నభోవాయుకుంభినీ సలిల తేజంబు లనియెడు మహాభూతంబులయందును, భూతవికారంబు లయిన ఘటపటాదుల యందును, గుణసామ్యం బయిన ప్రధానమందును, గుణవ్యతిరేకం బైన మహత్తత్త్వాదియందును, రజస్సత్త్వతమోగుణంబుల యందును భగవంతుం డవ్యయుం డీశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మ మనియెడు వాచకశబ్దంబులు గల్గి కేవలానుభవానంద స్వరూపకుండు నవి కల్పితుండు ననిర్దేశ్యుండై వ్యాప్యవ్యాపకరూపంబులం జేసి దృశ్యుండును ద్రష్టయు భోగ్యుండును భోక్తయు నయి నిర్దేశింపదగి వికల్పితుండై యుండుఁ, దత్కారణంబున నాసుర భావంబు విడిచి సర్వ భూతంబులందును దయాసుహృద్భావంబులు గల్గిన నధోఽక్షజుండు సంతసించు, ననంతు డాద్యుండు హరి సంతసించిన నలభ్యం బెయ్యదియు లేదు, జనార్దనచరణ సరసీరుహ యుగళస్మరణ సుధారస పానపరవశుల మైతిమేని మనకు దైవవశంబున నాకాంక్షితంబులై, సిద్ధించు ధర్మార్థకామంబులు, కాంక్షితంబై సిద్ధించు మోక్షం బననేల? త్రివర్గంబును నాత్మవిద్యయుం దర్కదండనీతి జీవికాదు లన్నియుఁ ద్రైగుణ్య విషయంబు లయిన వేదంబుల వలనం బ్రతిపాద్యంబులు, నిస్త్రైగుణ్యలక్షణంబునం బరమ పురుషుండైన హరికి నాత్మసమర్పణంబు సేయుట మేలు, పరమాత్మ తత్త్వజ్ఞానోదయంబునం జేసి స్వపరభ్రాంతి సేయక పురుషుండు యోగావధూతత్త్వంబున నాత్మ వికల్పభేదంబునం గలలోఁ గన్న విశేషంబుల భంగిం దథ్యం బనక మిథ్యయని తలంచు నని మఱియుఁ బ్రహ్లాదుం డిట్లనియె. (217)

స్నేహితులారా! కోరికలలో కామంతో చిక్కుకొన్న రాక్షసులకు హరిభజన అలవడదు. అలాగని, ఇష్టమైనప్పటికీ చాలా ప్రయాసపడాలి అనుకుంటారేమో! కాదు. వినండి. అన్ని ప్రాణుల మనస్సులలోనూ, అన్నిదిక్కులలోనూ భగవంతుడు ఉన్నాడు. బ్రహ్మయే పరాకాష్ఠగా ఉన్నటువంటి ఈ లోకంలో కన్పించునట్టి, కంటికి కన్పించనట్టి చిన్న పెద్ద జీవకోటిలోనూ; ఆకాశం, భూమి, నీరు, గాలి, అగ్ని - అనే పంచభూతాలలోనూ, వీటిల్లోనుంచి పుట్టినటువంటి కుండ, గుడ్డ లాంటి సమస్త వస్తువులలోనూ, ఆ దేవుడు ఉన్నాడు. గుణాలు నిండి ఉన్న మూలప్రకృతిలోనూ త్రిగుణాలకు అతీతమైన మహత్తత్త్వంలోనూ, రజోగుణం, సత్త్వగుణం, తమోగుణం అనే గుణత్రయంలోనూ, భగవంతుడు ఉన్నాడు. అలా ఉన్న ఆ స్వామి ఈశ్వరుడనీ, పరమాత్మ అనీ, పరబ్రహ్మ అనీ రకరకాలుగా పిలువబడతాడు.

ఆ పరమేశ్వరుడు అనుభవంచేత మాత్రమే మనం తెలుసుకొనగలిగే ఆనంద స్వరూపుడు. ఆయనకు ఎటువంటి మార్పూ ఉండదు. ఇటువంటిదని నిరూపింపదగిన రూపం ఉండదు. ఆ ప్రభువు సత్త్వం, రజస్తమోగుణాలు నిండిన తన దివ్యమైన మాయచేత, అదృశ్యమైన శక్తితో వ్యాపించునట్టి, వ్యాపింపజేయునట్టి రూపాలతో కనుపించువాడూ, చూచువాడూ, అనుభవింపదగినవాడూ, అనుభవించువాడూ తానే అయి స్పష్టాస్పష్టమైన రూపంతో ఉంటాడు.

ఈ కారణం వల్ల మానవుడు రాక్షస భావమును విడిచిపెట్టి అన్ని ప్రాణుల మీదా దయా దాక్షిణ్యాలు కలిగి ఉండాలి. అలా ఉంటే భగవంతుడు మెచ్చుకొంటాడు. భగవంతుడు మెచ్చుకొంటే మనకు లభించనిదేదీ ఉండాదు. ఆ శ్రీహరి చరణకమల స్మరణమనే అమృతరసం త్రాగి పరవశులం కాగలిగితే మనకు ఆ దేవుని దయవల్ల కోరకుండానే ధర్మ, అర్థ, కామాలు లభిస్తాయి. ఇక మనం కాంక్షించే మోక్షం లభిస్తుంది అని వేరే చెప్పాలా?

ధర్మం, అర్థం, కామం, వేదాంతం, తర్కం, దండనీతి - ఇలాంటి జీవితావసర విషయాలన్నీ త్రిగుణాత్మకాలైన వేదలలో ప్రతిపాదింప బడ్డయి. నిస్స్వార్థంతో, ఎటువంటి కోరికా లేకుండా త్రిగుణాతీతుడైన శ్రీహరికి హృదయమును సమర్పించడం మంచిది. పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకున్న మానవుడు తాను వేరనీ, మరొకరు వేరనీ భేదభావం పాటించడు. అటువంటి వ్యక్తి మహాయోగిలాగా ఆత్మ తత్త్వం గ్రహిస్తాడు. కలలో విషయాలు ఎలా నిజం కావో అలగే ఈ లోకం కూడా నిజం కాదనే తెలుసుకుంటాడు - అని చెప్పి ప్రహ్లాదుడు ఇంకా ఇలా అన్నాడు.



Aviśiṣṭaḥ asamastānāmaṃtaryāmitayā hariḥ / अविशिष्टः असमस्तानामंतर्यामितया हरिः. Sarveṣāṃ aṃtaryāmitvena - aviśiṣṭaḥ सर्वेषां अंतर्यामित्वेन - अविशिष्टः. Since He is the antaryāmī, the inner pervasive ruler regulating the actions, Lord Hari is called Aviśiṣṭaḥ. He pervades everything without differentiating.

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 6
Parāvarēṣu bhūtēṣu brahmāntasthāvarādiṣu,
Bhautikēṣu vikārēṣu bhūtēṣvatha mahatsu ca. (20)
Guṇēṣu guṇasāmyē ca guṇavyatikarē tathā,
Ēka ēva parō hyātmā bhagavānīśvarō’vyayaḥ. (21)
Pratyagātmasvarūpēṇā dr̥iśyarūpēṇā ca svayam,
Vyāpyavyāpakanirdēśyō hyanirdēśyō’vikalpitaḥ. (22)
Kēvalānubhavānanda svarūpaḥ paramēśvaraḥ,
Māyayāntarhitaiśvarya īyatē guṇasargayā. (23)

:: श्रीमद्भागवते सप्तमस्कन्धे षष्ठोऽध्यायः ::
परावरेषु भूतेषु ब्रह्मान्तस्थावरादिषु ।
भौतिकेषु विकारेषु भूतेष्वथ महत्सु च ॥ २० ॥
गुणेषु गुणसाम्ये च गुणव्यतिकरे तथा ।
एक एव परो ह्यात्मा भगवानीश्वरोऽव्ययः ॥ २१ ॥
प्रत्यगात्मस्वरूपेणा दृश्यरूपेणा च स्वयम् ।
व्याप्यव्यापकनिर्देश्यो ह्यनिर्देश्योऽविकल्पितः ॥ २२ ॥
केवलानुभवानन्द स्वरूपः परमेश्वरः ।
माययान्तर्हितैश्वर्य ईयते गुणसर्गया ॥ २३ ॥

The Supreme God, the supreme controller, who is infallible and indefatigable, is present in different forms of life, from the inert living beings such as the plants to Brahmā, the foremost created living being. He is also present in the varieties of material creations and in the material elements, the total material energy and the modes of material nature as well as the unmanifested material nature and the false ego. Although He is one, He is present everywhere, and He is also the transcendental Supersoul, the cause of all causes, who is present as the observer in the cores of the hearts of all living entities. He is indicated as that which is pervaded and as the all-pervading Supersoul, but actually He cannot be indicated. He is changeless and undivided. He is simply perceived as the supreme sac-cid-ānanda. Being covered by the curtain of the external energy, to the atheist He appears nonexistent.

इष्टोऽविशिष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः ।
क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viśiṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ ।
Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

7 సెప్టెం, 2013

308. ఇష్టః, इष्टः, Iṣṭaḥ

ఓం ఇష్టాయ నమః | ॐ इष्टाय नमः | OM Iṣṭāya namaḥ


ఇష్టః, इष्टः, Iṣṭaḥ

పరమానందాత్మకత్వాత్ ప్రియ ఇష్ట ఇతీర్యతే ।
యజ్ఞేన పూజిత ఇతి వా తథా హరి రుచ్యతే ॥

పరమానందరూపుడు కావున ఎల్లరకును విష్ణువు ప్రియమైనవాడు కావున ఇష్టః అని పిలువబడును. లేదా యజ్ఞములందు పూజింపబడువాడు కావున విష్ణువు ఇష్టః.

:: శ్రీమద్రామాయణే బాలకాండే అష్టాదశస్సర్గః ::
తేషామపి మహాతేజా రామస్సత్యపరాక్రమః ।
ఇష్టః సర్వస్య లోకస్య శాశాంక ఇవ నిర్మలః ॥ 25 ॥

రఘువంశజులలో మహాతేజశ్శాలియైన శ్రీరాముడు అమోఘమైన పరాక్రమముగలవాడు. సమస్తప్రజలకును పూర్ణచంద్రునివలె ఆహ్లాదకరుడు లేదా ప్రియమైనవాడు.



Paramānaṃdātmakatvāt priya iṣṭa itīryate,
Yajñena pūjita iti vā tathā hari rucyate.

परमानंदात्मकत्वात् प्रिय इष्ट इतीर्यते ।
यज्ञेन पूजित इति वा तथा हरि रुच्यते ॥

One who is dear to all because He is of the nature of supreme bliss. Or one who is worshiped in iṣṭi or yajña i.e., sacrifice.

Śrīmad Rāmāyaṇa - Book 1, Chapter 18
Teṣāmapi mahātejā rāmassatyaparākramaḥ,
Iṣṭaḥ sarvasya lokasya śāśāṃka iva nirmalaḥ. (25)

:: श्रीमद्रामायणे बालकांडे अष्टादशस्सर्गः ::
तेषामपि महातेजा रामस्सत्यपराक्रमः ।
इष्टः सर्वस्य लोकस्य शाशांक इव निर्मलः ॥ २५ ॥

Among all of them, Rāma stood out with his supreme radiance and true valor. He endeared everyone like a spotless moon.

इष्टोऽविशिष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः ।
क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viśiṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ ।
Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

6 సెప్టెం, 2013

307. అనన్తజిత్‌, अनन्तजित्‌, Anantajit

ఓం అనన్తజితే నమః | ॐ अनन्तजिते नमः | OM Anantajite namaḥ


అనన్తజిత్‌, अनन्तजित्‌, Anantajit

యుద్ధక్రీడాదిషు హరిః సర్వత్రాచింత్యశక్తిమాన్ ।
సర్వభూతాని జయతీత్యనంతజిదితీర్యతే ॥

ఊహించుటకు సైతము అలవికాని శక్తి కలవాడు కావున యుద్ధక్రీడాదులయందు అనంతములగు, సమస్తములగు భూతములను జయించును.



Yuddhakrīḍādiṣu hariḥ sarvatrāciṃtyaśaktimān,
Sarvabhūtāni jayatītyanaṃtajiditīryate.

युद्धक्रीडादिषु हरिः सर्वत्राचिंत्यशक्तिमान् ।
सर्वभूतानि जयतीत्यनंतजिदितीर्यते ॥

By His unimaginable power, He excelled all creatures in battle or sport all the times.

Śrīmad Bhāgavata - Canto 6, Chapter 16
Ajita jitaḥ samamatibhiḥ sādhubhirbhavānˈjitātmabhirbhavatā,
Vijitāste’pi ca bhajatāmakāmātmanāṃ ya ātmado’tikaruṇāḥ. (34)

:: श्रीमद्भागवते षष्टस्कन्धे षोडशोऽध्यायः ::
अजित जितः सममतिभिः साधुभिर्भवान्‌जितात्मभिर्भवता ।
विजितास्तेऽपि च भजतामकामात्मनां य आत्मदोऽतिकरुणाः ॥ ३४ ॥

O unconquerable Lord, although You cannot be conquered by anyone, You are certainly conquered by devotees who have control of the mind and senses. They can keep You under their control because You are causelessly merciful to devotees who desire no material profit from You. Indeed, You give Yourself to them, and because of this You also have full control over Your devotees.

युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ ॥ ౩౩ ॥

Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ ।
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥

5 సెప్టెం, 2013

306. సహస్రజిత్‌, सहस्रजित्‌, Sahasrajit

ఓం సహస్రజితే నమః | ॐ सहस्रजिते नमः | OM Sahasrajite namaḥ


సహస్రజిత్‌, सहस्रजित्‌, Sahasrajit

సురారీణాం సహస్రాణి యుద్ధే జయతి యో హరిః ।
స సహస్రజిదిత్యుక్తో విష్ణుర్భాగతోత్తమైః ॥

యుద్ధమునందు సురారుల అనగా దేవతల శత్రువులైన రాక్షసుల సహస్రములను జయించును గావున విష్ణువు సహస్రజిత్‌.

:: పోతన భాగవతము - సప్తమ స్కంధము::
వ. ఇట్లు కేవల పురుషరూపంబును మృగరూపంబునుం గాని నరసింహ రూపంబున రేయునుం బవలునుంగాని సంధ్యాసమయంబున, నంతరంగంబును బహిరంగంబునుం గాని సభాద్వారంబున, గగనంబునుం భూమియునుం గాని యూరుమధ్యంబునఁ, బ్రాణసహితంబులును బ్రాణరహితంబులును గాని నఖంబులం ద్రైలోక్యజన హృదయ భల్లుండయిన దైత్యమల్లుని వధియుంచి మహాధన కీలాభీల దర్శనుండును, గరాళవదనుండును లేలిహానభీషణ జిహ్వుండును శోణిత పంకాంకిత కేసరుండునై ప్రేవులు కంఠమాలికలుగా ధరించి కుంభి కుంభ విదళనంబును సేసి చనుదెంచు పంచాననంబునుంబోలె దనుజకుంజర హృదయకమల విదళంబుచేసి తదీయ రక్తసిక్తంబులైన నఖంబులు సంధ్యారాగ రక్తచంద్రరేఖల చెలువు వహింప సహింపక లేచి తన కట్టెదుర నాయుధంబు లెత్తుకొని తత్తరంబున రణంబునకు రక్కసులం బెక్కుసహస్రంబులం జక్రాదిక నిర్వక్ర సాధనంబుల నొక్కనిఁ జిక్కకుండం జక్కడిచె, ని వ్విధంబున. (299)

ఈ విధంగా కేవలం నరరూపమూ, కేవలం మృగరూపమూ కానటువంటి నరసింహరూపంతో, రాత్రీ పగలు కాని సంధ్యాసమయంలో, గృహమునకు లోపలా వెలుపలా కాని ద్వారమధ్యంలో, ఆకాశమూ భూమి కానటువంటి ఊరూ ప్రదేశంలో, ప్రాణసహితాలూ, ప్రాణరహితాలూ కాని గోళ్ళతో బ్రహ్మ ఇచ్చిన వరనియమాలకు భంగం లేకుండగా ముల్లోకాలకూ గుండెగాలమైన రాక్షసరాజును వధించాడు నరసింహస్వామి.

ఉగ్రస్వరూపంతో ఆయన దావానల జ్వాల లాగా దర్శనమిస్తున్నాడు. ఆ నరహరి ముఖం భయంకరంగా ఉన్నది. చాచిన నాలుక నాగేంద్రునిలా భీకరంగా ఉన్నది. మెడజూలు నెత్తురుతో తడిసి ఎర్రబడింది. ఆ స్వామి రాక్షసుని ప్రేవులు కంఠమాలికలుగా ధరించి ఉన్నాడు. దానవుని హృదయకమలం చీల్చివేసిన నరసింహస్వామి మత్తేభ కుంభస్థలం చీల్చి చెండాడిన సింహరాజంలాగా విరాజిల్లుతున్నాడు. రక్తంతో తడిసిన ఆయన నఖాలు సంధ్యారాగరంజిత చంద్రరేఖల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ రూపం చూచి కోపం పట్టలేక వేలకొలదీ అసుర వీరులు ఆయుధాలతో దానవాంతకుని పైకి దండెత్తి వచ్చారు. నరసింహస్వామి వచ్చిన వారిని వచ్చినట్లే చక్రాది ఆయుధాలతో పెక్కువేల రక్కసులను ఒక్కడినీ విడువకుండా వధించివేశాడు.



Surārīṇāṃ sahasrāṇi yuddhe jayati yo hariḥ,
Sa sahasrajidityukto viṣṇurbhāgatottamaiḥ.

सुरारीणां सहस्राणि युद्धे जयति यो हरिः ।
स सहस्रजिदित्युक्तो विष्णुर्भागतोत्तमैः ॥


Since Lord Viṣṇu is always victorious over innumerable enemies of Devas in battle, He is Sahasrajit.

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 8
Nakhāṅkurotpāṭitahr̥tsaroruhaṃ visr̥jya tasyānucarānudāyudhān,
Ahansamastānnakhaśastrapāṇirbhirdordaṇḍayūtho’nupathānsahasraśaḥ. (31)

:: श्रीमद्भागवते सप्तमस्कन्धे अष्टमोऽध्यायः ::
नखाङ्कुरोत्पाटितहृत्सरोरुहं विसृज्य तस्यानुचरानुदायुधान् ।
अहन्समस्तान्नखशस्त्रपाणिर्भिर्दोर्दण्डयूथोऽनुपथान्सहस्रशः ॥ ३१ ॥

With many, many arms, He (Lord Nr̥siṃha) first uprooted Hiraṇyakaśipu's heart and then threw him aside and turned toward the demon's soldiers. These soldiers had come in thousands to fight with Him with raised weapons and were very faithful followers of Hiraṇyakaśipu, but Lord Nṛsiḿhadeva killed all of them merely with the ends of His nails.

युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ ॥ ౩౩ ॥

Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ ।
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥