8 సెప్టెం, 2013

309. అవిశిష్టః, अविशिष्टः, Aviśiṣṭaḥ

ఓం అవిశిష్టాయ నమః | ॐ अविशिष्टाय नमः | OM Aviśiṣṭāya namaḥ


అవిశిష్టః, अविशिष्टः, Aviśiṣṭaḥ

అవిశిష్టః అసమస్తానామంతర్యామితయా హరిః. సర్వేషాం అంతర్యామిత్వేన - అవిశిష్టః ఎల్ల ప్రాణులకును ఎల్ల పదార్థములకును అంతర్యామి అనగా లోపలగా ఉండుచు వానిని తమ తమ వ్యాపారములందు ప్రవర్తిల్లజేయుచూ అదుపులోనుంచువాడు కావున హరి అవిశిష్టుడు. ఏ భేదమును లేక అంతటను సమరూపముతో నుండువాడు.

:: పోతన భాగవతము - సప్తమ స్కంధము ::
వ. కావున విషయంబులఁ జిక్కువడిన రక్కసులకు హరిభజనంబు శక్యంబు గాదు, రమ్యమయ్యును బహుతర ప్రయాస గమ్యమని తలంచితిరేనిఁ జెప్పెద, సర్వభూతాత్మకుండైన సర్వ దిక్కాల సిద్ధుండై బ్రహ్మ కడపలగాఁ గల చరాచర స్థూల సూక్ష్మజీవసంఘంబు లందును, నభోవాయుకుంభినీ సలిల తేజంబు లనియెడు మహాభూతంబులయందును, భూతవికారంబు లయిన ఘటపటాదుల యందును, గుణసామ్యం బయిన ప్రధానమందును, గుణవ్యతిరేకం బైన మహత్తత్త్వాదియందును, రజస్సత్త్వతమోగుణంబుల యందును భగవంతుం డవ్యయుం డీశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మ మనియెడు వాచకశబ్దంబులు గల్గి కేవలానుభవానంద స్వరూపకుండు నవి కల్పితుండు ననిర్దేశ్యుండై వ్యాప్యవ్యాపకరూపంబులం జేసి దృశ్యుండును ద్రష్టయు భోగ్యుండును భోక్తయు నయి నిర్దేశింపదగి వికల్పితుండై యుండుఁ, దత్కారణంబున నాసుర భావంబు విడిచి సర్వ భూతంబులందును దయాసుహృద్భావంబులు గల్గిన నధోఽక్షజుండు సంతసించు, ననంతు డాద్యుండు హరి సంతసించిన నలభ్యం బెయ్యదియు లేదు, జనార్దనచరణ సరసీరుహ యుగళస్మరణ సుధారస పానపరవశుల మైతిమేని మనకు దైవవశంబున నాకాంక్షితంబులై, సిద్ధించు ధర్మార్థకామంబులు, కాంక్షితంబై సిద్ధించు మోక్షం బననేల? త్రివర్గంబును నాత్మవిద్యయుం దర్కదండనీతి జీవికాదు లన్నియుఁ ద్రైగుణ్య విషయంబు లయిన వేదంబుల వలనం బ్రతిపాద్యంబులు, నిస్త్రైగుణ్యలక్షణంబునం బరమ పురుషుండైన హరికి నాత్మసమర్పణంబు సేయుట మేలు, పరమాత్మ తత్త్వజ్ఞానోదయంబునం జేసి స్వపరభ్రాంతి సేయక పురుషుండు యోగావధూతత్త్వంబున నాత్మ వికల్పభేదంబునం గలలోఁ గన్న విశేషంబుల భంగిం దథ్యం బనక మిథ్యయని తలంచు నని మఱియుఁ బ్రహ్లాదుం డిట్లనియె. (217)

స్నేహితులారా! కోరికలలో కామంతో చిక్కుకొన్న రాక్షసులకు హరిభజన అలవడదు. అలాగని, ఇష్టమైనప్పటికీ చాలా ప్రయాసపడాలి అనుకుంటారేమో! కాదు. వినండి. అన్ని ప్రాణుల మనస్సులలోనూ, అన్నిదిక్కులలోనూ భగవంతుడు ఉన్నాడు. బ్రహ్మయే పరాకాష్ఠగా ఉన్నటువంటి ఈ లోకంలో కన్పించునట్టి, కంటికి కన్పించనట్టి చిన్న పెద్ద జీవకోటిలోనూ; ఆకాశం, భూమి, నీరు, గాలి, అగ్ని - అనే పంచభూతాలలోనూ, వీటిల్లోనుంచి పుట్టినటువంటి కుండ, గుడ్డ లాంటి సమస్త వస్తువులలోనూ, ఆ దేవుడు ఉన్నాడు. గుణాలు నిండి ఉన్న మూలప్రకృతిలోనూ త్రిగుణాలకు అతీతమైన మహత్తత్త్వంలోనూ, రజోగుణం, సత్త్వగుణం, తమోగుణం అనే గుణత్రయంలోనూ, భగవంతుడు ఉన్నాడు. అలా ఉన్న ఆ స్వామి ఈశ్వరుడనీ, పరమాత్మ అనీ, పరబ్రహ్మ అనీ రకరకాలుగా పిలువబడతాడు.

ఆ పరమేశ్వరుడు అనుభవంచేత మాత్రమే మనం తెలుసుకొనగలిగే ఆనంద స్వరూపుడు. ఆయనకు ఎటువంటి మార్పూ ఉండదు. ఇటువంటిదని నిరూపింపదగిన రూపం ఉండదు. ఆ ప్రభువు సత్త్వం, రజస్తమోగుణాలు నిండిన తన దివ్యమైన మాయచేత, అదృశ్యమైన శక్తితో వ్యాపించునట్టి, వ్యాపింపజేయునట్టి రూపాలతో కనుపించువాడూ, చూచువాడూ, అనుభవింపదగినవాడూ, అనుభవించువాడూ తానే అయి స్పష్టాస్పష్టమైన రూపంతో ఉంటాడు.

ఈ కారణం వల్ల మానవుడు రాక్షస భావమును విడిచిపెట్టి అన్ని ప్రాణుల మీదా దయా దాక్షిణ్యాలు కలిగి ఉండాలి. అలా ఉంటే భగవంతుడు మెచ్చుకొంటాడు. భగవంతుడు మెచ్చుకొంటే మనకు లభించనిదేదీ ఉండాదు. ఆ శ్రీహరి చరణకమల స్మరణమనే అమృతరసం త్రాగి పరవశులం కాగలిగితే మనకు ఆ దేవుని దయవల్ల కోరకుండానే ధర్మ, అర్థ, కామాలు లభిస్తాయి. ఇక మనం కాంక్షించే మోక్షం లభిస్తుంది అని వేరే చెప్పాలా?

ధర్మం, అర్థం, కామం, వేదాంతం, తర్కం, దండనీతి - ఇలాంటి జీవితావసర విషయాలన్నీ త్రిగుణాత్మకాలైన వేదలలో ప్రతిపాదింప బడ్డయి. నిస్స్వార్థంతో, ఎటువంటి కోరికా లేకుండా త్రిగుణాతీతుడైన శ్రీహరికి హృదయమును సమర్పించడం మంచిది. పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకున్న మానవుడు తాను వేరనీ, మరొకరు వేరనీ భేదభావం పాటించడు. అటువంటి వ్యక్తి మహాయోగిలాగా ఆత్మ తత్త్వం గ్రహిస్తాడు. కలలో విషయాలు ఎలా నిజం కావో అలగే ఈ లోకం కూడా నిజం కాదనే తెలుసుకుంటాడు - అని చెప్పి ప్రహ్లాదుడు ఇంకా ఇలా అన్నాడు.



Aviśiṣṭaḥ asamastānāmaṃtaryāmitayā hariḥ / अविशिष्टः असमस्तानामंतर्यामितया हरिः. Sarveṣāṃ aṃtaryāmitvena - aviśiṣṭaḥ सर्वेषां अंतर्यामित्वेन - अविशिष्टः. Since He is the antaryāmī, the inner pervasive ruler regulating the actions, Lord Hari is called Aviśiṣṭaḥ. He pervades everything without differentiating.

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 6
Parāvarēṣu bhūtēṣu brahmāntasthāvarādiṣu,
Bhautikēṣu vikārēṣu bhūtēṣvatha mahatsu ca. (20)
Guṇēṣu guṇasāmyē ca guṇavyatikarē tathā,
Ēka ēva parō hyātmā bhagavānīśvarō’vyayaḥ. (21)
Pratyagātmasvarūpēṇā dr̥iśyarūpēṇā ca svayam,
Vyāpyavyāpakanirdēśyō hyanirdēśyō’vikalpitaḥ. (22)
Kēvalānubhavānanda svarūpaḥ paramēśvaraḥ,
Māyayāntarhitaiśvarya īyatē guṇasargayā. (23)

:: श्रीमद्भागवते सप्तमस्कन्धे षष्ठोऽध्यायः ::
परावरेषु भूतेषु ब्रह्मान्तस्थावरादिषु ।
भौतिकेषु विकारेषु भूतेष्वथ महत्सु च ॥ २० ॥
गुणेषु गुणसाम्ये च गुणव्यतिकरे तथा ।
एक एव परो ह्यात्मा भगवानीश्वरोऽव्ययः ॥ २१ ॥
प्रत्यगात्मस्वरूपेणा दृश्यरूपेणा च स्वयम् ।
व्याप्यव्यापकनिर्देश्यो ह्यनिर्देश्योऽविकल्पितः ॥ २२ ॥
केवलानुभवानन्द स्वरूपः परमेश्वरः ।
माययान्तर्हितैश्वर्य ईयते गुणसर्गया ॥ २३ ॥

The Supreme God, the supreme controller, who is infallible and indefatigable, is present in different forms of life, from the inert living beings such as the plants to Brahmā, the foremost created living being. He is also present in the varieties of material creations and in the material elements, the total material energy and the modes of material nature as well as the unmanifested material nature and the false ego. Although He is one, He is present everywhere, and He is also the transcendental Supersoul, the cause of all causes, who is present as the observer in the cores of the hearts of all living entities. He is indicated as that which is pervaded and as the all-pervading Supersoul, but actually He cannot be indicated. He is changeless and undivided. He is simply perceived as the supreme sac-cid-ānanda. Being covered by the curtain of the external energy, to the atheist He appears nonexistent.

इष्टोऽविशिष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः ।
क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viśiṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ ।
Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి