4 సెప్టెం, 2013

305. వ్యక్తరూపః, व्यक्तरूपः, Vyaktarūpaḥ

ఓం వ్యక్తరూపాయ నమః | ॐ व्यक्तरूपाय नमः | OM Vyaktarūpāya namaḥ


వ్యక్తరూపః, व्यक्तरूपः, Vyaktarūpaḥ
వ్యక్తం రూపం భవత్యస్య స్థూలరూపేణ యోగినామ్ ।
స్వయంప్రకాశమానత్వాద్ వ్యక్తరూప ఇతీర్యతే ॥

ఆయా అవతారములలో స్థూల రూపముతో వ్యక్తమగు, స్పష్టముగా గోచరించు వాడు. లేదా స్వయం ప్రకాశమానుడు కావున యోగులకు వ్యక్తమగు రూపము కలవాడు.

:: పోతన భాగవతము తృతీయ స్కంధము ::
సీ. అనఘాత్మా! మఱి భవదవతార గుణకర్మ ఘనవిడంబన హేతుకంబు లయిన

రమణీయమగు దాశరథి వసుదేవ కుమారాది దివ్యనామంబు లోలి

వెలయంగ మనుజులు వివశాత్ములై యవసానకాలంబున సంస్మరించి

జన్మ జన్మాంతర సంచిత దురితంబుఁ బాసి కైవల్యసంప్రాప్తు లగుదు
తే. రట్టి దివ్యావతారంబు లవధరించు, నజుఁడవగు నీకు మ్రొక్కెద ననఘచరిత!

చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార! భక్తమందార! దుర్భవ భయవిదూర! (304)

స్వామీ! నీవు పరమపవిత్రుడవు! సచ్చరిత్రుడవు! శాశ్వతమైన దివ్యమంగళ స్వరూపం కలవాడవు! ఎల్లప్పుడూ లక్ష్మీదేవితో కూడి సంచరించేవాడవు. భక్తులకు కల్పవృక్షం వంటి వాడవు. దుర్భరమైన సంసార భయాన్ని దూరంగా పోగొట్టేవాడవు. నీ అవతారాలకూ, సద్గుణాలకూ, సత్కార్యాలకూ, మహదాశయాలకూ కారణమైనవీ, మనోహరమైనవీ అయిన "దాశరథి", "వాసుదేవా"ది దివ్యనామాలను మనుష్యులు తమ తుది ఘడియల్లో స్మరించి, జన్మజన్మాలలో కూడబెట్టుకొన్న పాపాలను పొగొట్టుకొని మోక్షం పొందుతారు. జన్మలేనివాడవై కూడా అటువంటి దివ్యావతారాలలో జన్మించే నీకు మ్రొక్కుతున్నాను.



Vyaktaṃ rūpaṃ bhavatyasya sthūlarūpeṇa yoginām,
Svayaṃprakāśamānatvād vyaktarūpa itīryate.

व्यक्तं रूपं भवत्यस्य स्थूलरूपेण योगिनाम् ।
स्वयंप्रकाशमानत्वाद् व्यक्तरूप इतीर्यते ॥

His form is perceived when He assumes a concrete shape. Or being self-luminous, He is visible to the Yogis or learned men.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 10
Kr̥ṣṇa kr̥ṣṇa mahāyogiṃstvamādyaḥ puruṣaḥ paraḥ,
Vyaktāvyaktamidaṃ viśvaṃ rūpaṃ te brāhmaṇā viduḥ. (29)

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे दशमोऽध्यायः ::
कृष्ण कृष्ण महायोगिंस्त्वमाद्यः पुरुषः परः ।
व्यक्ताव्यक्तमिदं विश्वं रूपं ते ब्राह्मणा विदुः ॥ २९ ॥

O Lord Kṛṣṇa! Lord Kṛṣṇa! Your opulent mysticism is inconceivable. You are the supreme, original person, the cause of all causes, immediate and remote, and You are beyond this material creation. Learned brāhmaṇas know that You are everything and that this cosmic manifestation, in its gross and subtle aspects, is Your form.

युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ ॥ ౩౩ ॥

Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ ।
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి