5 సెప్టెం, 2013

306. సహస్రజిత్‌, सहस्रजित्‌, Sahasrajit

ఓం సహస్రజితే నమః | ॐ सहस्रजिते नमः | OM Sahasrajite namaḥ


సహస్రజిత్‌, सहस्रजित्‌, Sahasrajit

సురారీణాం సహస్రాణి యుద్ధే జయతి యో హరిః ।
స సహస్రజిదిత్యుక్తో విష్ణుర్భాగతోత్తమైః ॥

యుద్ధమునందు సురారుల అనగా దేవతల శత్రువులైన రాక్షసుల సహస్రములను జయించును గావున విష్ణువు సహస్రజిత్‌.

:: పోతన భాగవతము - సప్తమ స్కంధము::
వ. ఇట్లు కేవల పురుషరూపంబును మృగరూపంబునుం గాని నరసింహ రూపంబున రేయునుం బవలునుంగాని సంధ్యాసమయంబున, నంతరంగంబును బహిరంగంబునుం గాని సభాద్వారంబున, గగనంబునుం భూమియునుం గాని యూరుమధ్యంబునఁ, బ్రాణసహితంబులును బ్రాణరహితంబులును గాని నఖంబులం ద్రైలోక్యజన హృదయ భల్లుండయిన దైత్యమల్లుని వధియుంచి మహాధన కీలాభీల దర్శనుండును, గరాళవదనుండును లేలిహానభీషణ జిహ్వుండును శోణిత పంకాంకిత కేసరుండునై ప్రేవులు కంఠమాలికలుగా ధరించి కుంభి కుంభ విదళనంబును సేసి చనుదెంచు పంచాననంబునుంబోలె దనుజకుంజర హృదయకమల విదళంబుచేసి తదీయ రక్తసిక్తంబులైన నఖంబులు సంధ్యారాగ రక్తచంద్రరేఖల చెలువు వహింప సహింపక లేచి తన కట్టెదుర నాయుధంబు లెత్తుకొని తత్తరంబున రణంబునకు రక్కసులం బెక్కుసహస్రంబులం జక్రాదిక నిర్వక్ర సాధనంబుల నొక్కనిఁ జిక్కకుండం జక్కడిచె, ని వ్విధంబున. (299)

ఈ విధంగా కేవలం నరరూపమూ, కేవలం మృగరూపమూ కానటువంటి నరసింహరూపంతో, రాత్రీ పగలు కాని సంధ్యాసమయంలో, గృహమునకు లోపలా వెలుపలా కాని ద్వారమధ్యంలో, ఆకాశమూ భూమి కానటువంటి ఊరూ ప్రదేశంలో, ప్రాణసహితాలూ, ప్రాణరహితాలూ కాని గోళ్ళతో బ్రహ్మ ఇచ్చిన వరనియమాలకు భంగం లేకుండగా ముల్లోకాలకూ గుండెగాలమైన రాక్షసరాజును వధించాడు నరసింహస్వామి.

ఉగ్రస్వరూపంతో ఆయన దావానల జ్వాల లాగా దర్శనమిస్తున్నాడు. ఆ నరహరి ముఖం భయంకరంగా ఉన్నది. చాచిన నాలుక నాగేంద్రునిలా భీకరంగా ఉన్నది. మెడజూలు నెత్తురుతో తడిసి ఎర్రబడింది. ఆ స్వామి రాక్షసుని ప్రేవులు కంఠమాలికలుగా ధరించి ఉన్నాడు. దానవుని హృదయకమలం చీల్చివేసిన నరసింహస్వామి మత్తేభ కుంభస్థలం చీల్చి చెండాడిన సింహరాజంలాగా విరాజిల్లుతున్నాడు. రక్తంతో తడిసిన ఆయన నఖాలు సంధ్యారాగరంజిత చంద్రరేఖల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ రూపం చూచి కోపం పట్టలేక వేలకొలదీ అసుర వీరులు ఆయుధాలతో దానవాంతకుని పైకి దండెత్తి వచ్చారు. నరసింహస్వామి వచ్చిన వారిని వచ్చినట్లే చక్రాది ఆయుధాలతో పెక్కువేల రక్కసులను ఒక్కడినీ విడువకుండా వధించివేశాడు.



Surārīṇāṃ sahasrāṇi yuddhe jayati yo hariḥ,
Sa sahasrajidityukto viṣṇurbhāgatottamaiḥ.

सुरारीणां सहस्राणि युद्धे जयति यो हरिः ।
स सहस्रजिदित्युक्तो विष्णुर्भागतोत्तमैः ॥


Since Lord Viṣṇu is always victorious over innumerable enemies of Devas in battle, He is Sahasrajit.

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 8
Nakhāṅkurotpāṭitahr̥tsaroruhaṃ visr̥jya tasyānucarānudāyudhān,
Ahansamastānnakhaśastrapāṇirbhirdordaṇḍayūtho’nupathānsahasraśaḥ. (31)

:: श्रीमद्भागवते सप्तमस्कन्धे अष्टमोऽध्यायः ::
नखाङ्कुरोत्पाटितहृत्सरोरुहं विसृज्य तस्यानुचरानुदायुधान् ।
अहन्समस्तान्नखशस्त्रपाणिर्भिर्दोर्दण्डयूथोऽनुपथान्सहस्रशः ॥ ३१ ॥

With many, many arms, He (Lord Nr̥siṃha) first uprooted Hiraṇyakaśipu's heart and then threw him aside and turned toward the demon's soldiers. These soldiers had come in thousands to fight with Him with raised weapons and were very faithful followers of Hiraṇyakaśipu, but Lord Nṛsiḿhadeva killed all of them merely with the ends of His nails.

युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ ॥ ౩౩ ॥

Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ ।
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి